Bhatti Vikramarka : నేటి నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేడు తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. 90 రోజుల్లో 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు భట్టి విక్రమార్క. ఆయన పాదయాత్రలో 1,365 కిలోమీటర్లు నడవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి తర్వాత నియోజకవర్గాల సంఖ్య పరంగా ఇది రెండవ అతిపెద్ద పాదయాత్ర. ఈ పాదయాత్ర దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. ముఖ్య అతిధులుగా పాల్గొనేందుకు రాజస్థాన్‌తో సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో నాలుగైదు పెద్ద బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
Also Read : MQ-9 Reaper: ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ ప్రత్యేకతలేంటో తెలుసా?
Also Read
దళిత వర్గానికి చెందిన భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించి జూన్ 15న ఖమ్మం జిల్లాలో యాత్రను ముగించనున్నారు. ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’లో భాగంగా పాదయాత్ర చేపట్టాలని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఏఐసీసీ నాయకత్వం భట్టిని కోరిందని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి తెలిపారు. అయితే.. ఇది వ్యక్తిగతంగా చేస్తున్న యాత్ర కాదని, ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ చేపట్టే యాత్రేనని ఇదివరకే భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, వివిధ సెక్షన్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కోట్లు ఖర్చు చేసినా వాటి ఫలాలు ప్రజలకు అందకపోవడం బాధాకరమన్నారు.
Also Read : liquor case: ఈడీ ముందుకు కవిత.. ఢిల్లీకి క్యూ కట్టిన మంత్రులు.. ఏం జరగబోతోంది?
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!