Bhatti Vikramarka Fires On BJP And BRS Parties In Adilabad Corner Meeting: మన భారతదేశం, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను కట్టగట్టి బంగాళాఖాతంలో వేద్దామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నఆయన.. తెలంగాణ ప్రభుత్వం రూ.18 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది కానీ.. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో ఏ మార్పు రాలేదని అన్నారు. రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగు పడిందని, సామాన్య జీవితాలు బాగు పడలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ తెచ్చింది మద్యాన్ని ఏరులుగా పారించేందుకు కాదన్నారు. ఇకపై ఏ ఆటలు సాగవని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్ట్ షాప్‌లన్నింటినీ బంద్ చేస్తామని అన్నారు.
Jagadish Reddy: బీజేపీ నుండి దేశాన్ని రక్షిస్తాం.. కవిత ఈడీ విచారణపై మంత్రి ధ్వజం
ఇన్నేళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టాడా? అని భట్టి ప్రశ్నించారు. ఏమైనా అంటే కాళేశ్వరం కట్టామని అంటారని, దాని వల్ల ఒక్క ఎకరానికి అయినా నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పారే నీటిబొట్టు.. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల వల్లేనే అని అన్నారు. ఆ నీళ్లను చూపించి లక్షా 28వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. లేక లేక నోటిఫికేషన్ ఇస్తే.. అది కూడా లీకైందన్నారు. పేపర్ లీక్‌లో ఉన్న వాళ్లు పెద్దలే ఉన్నారన్నారు. నిధులన్నీ పోయాయని, ఉద్యోగాలేవీ రాలేదని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని, అందుకు ప్రశ్నించడం ఆగిపోయిందని వెల్లడించారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, దానికి అడ్డుగా ఉన్న బీఆర్ఎస్‌ను బంగాళా ఖాతంలో కలిపేందుకు నడుం బిగిద్దామని పిలుపునిచ్చారు.
Nano Car : ఈ కారుకు ఇంజినే లేదు ఎలా నడుస్తుంది..?
మరోవైపు.. బోధన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరాచకాలు, అక్రమాలు విస్తృతంగా పెరిగిపోయాయని ఆరోపణలు చేశారు. ఏం తప్పులు చేశారని గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారని ప్రశ్నించారు. షకీల్ ఓ ఇసుక దొంగ అని, ఏనాడూ ముస్లిం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో మాట్లాడలేదని దుయ్యబట్టారు. సిద్ధి పేట్, సిరిసిల్ల, గజ్వేల్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్స్.. మిగితా చోట్ల ఎందుకు పూర్తికావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఇరిగేషన్, విద్యుత్ ప్రాజెక్టులు, విద్యాసంస్థలు కాంగ్రెస్ పాలనలో ఏర్పడినవేనన్నారు. తాము తెలంగాణ ఇస్తేనే మీరంతా మంత్రులయ్యారని అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని ఆడిగితే, తిరగబడతామని హెచ్చరించారు.