గాంధీభవన్లో పూర్వ ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ పూర్వ కమిటీలో పనిచేసిన నాయకుల సీనియార్టీకి అనుగుణంగా కాంగ్రెస్ మెయిన్ కమిటీలో మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీలో తప్పనిసరిగా ప్రాధాన్యత కల్పించడానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ పూర్వ నాయకులు తమ సహాయ, సహకారాలు అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read : Army Rescues Tourists: భారీ హిమపాతం.. 370 మంది పర్యాటకులను రక్షించిన ఆర్మీ
ఈనెల 16 నుంచి ప్రారంభించే నా పాదయాత్రతో పాటు రేవంత్ నిర్వహించే యాత్రలో కూడా సీనియర్ ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు కలిసి నడవాలన్నారు. పూర్వ ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుల బయోడేటాలను సేకరించి గాంధీభవన్లో భద్రపరిచి వారికి అవకాశాలు కల్పించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీఎల్పీ నేతగా నేను తీసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని సిద్ధాంతాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం జీవితాలనే ధారపోసిన సీనియర్ నాయకులను ఎవరిని పార్టీ మర్చిపోదన్నారు. తప్పనిసరిగా పార్టీ ఏదో ఒక అవకాశం కల్పిస్తుందని ఆయన తెలిపారు.
Also Read : PM Modi: భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తడం దురదృష్టకరం.. రాహుల్‌పై ప్రధాని ధ్వజం