తెలంగాణలో కొత్త నినాదం తేవాలని, ఆపరేషన్ లోటస్ ఛోడో భారత్ జోడో అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఎక్కువ అని అన్నారు. అందరి అభిప్రాయాలు చెప్పుకొనే వేసులు బాటు ఉంటుందని తెలిపారు. కోమటిరెడ్డి వ్యవహారంలో నోటీసులు ఇచ్చరని, కానీ లక్ష్మణ రేఖ వుంటుందని తెలిపారు.
మోడీ పాలసీలు దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో రెండో రోజు కొనసాగుతుంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తుందని, కాంగ్రెస్కు భారత్ జూడో యాత్ర సంజీవని అని ప్రజలు అంటున్నారని అన్నారు.
బీజేపీ కేంద్రంలో దోపిడీ చేసిన సొమ్ము మునుగోడులో పెడుతున్నారని అన్నారు. మునుగోడు ఓటర్లు తెలివైన వారని, మునుగోడు ప్రజల్ని ఎవరు కొనలేరని అన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
మునుగోడు ప్రచారంలో భాగంగా.. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మునుగోడులో జరుగుతున్న తీరుపై వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించామన్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ , బీజేపీ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలను విచ్చలవిడిగా ఊపయోగిస్తున్నాయని అన్నారు.