Bhatti Vikramarka On Telangana House Rails: సీఎల్పీ పక్షాన తాము చేసిన పోరాటం కారణంగానే.. ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇళ్లు లేని నిరుపేదల దుస్థితి గురించి అసెంబ్లీ సమావేశాల్లో తాము గళమెత్తామని, అలాగే అనేక రకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాలు నిర్వహించామని అన్నారు. గతేడాది మార్చి నెలలో మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో పీపుల్స్ మార్చ్ పేరిట తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో.. ప్రియాంక అనే మహిళ తన ఇంటికి తీసుకువెళ్లి, ఒక్క గదిలోనే తాను, తన అత్త మామ, వాళ్ళ అత్త మామ కలిసి మూడు కుటుంబాలు కాపురం చేస్తున్నామని తన గోడు వెళ్ళబోసుకుంటూ కన్నీటి పర్యంతమైందని.. తమకు ఇంటి స్థలం ఇప్పించాలని వేడుకుందని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆవేదన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు.
Thai Drug Dealer : డామిట్ కథ అడ్డం తిరిగింది.. ఎన్ని సర్జరీలు చేయించుకున్న దొరికేశా
ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్లి, రాష్ట్రంలో ప్రియాంక లాంటి నిరుపేద కుటుంబాలు పడుతున్న దుస్థితి నుంచి విముక్తి చేయడానికి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ఒత్తిడి పెంచామని భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే.. సొంత ఇంటి జాగా కలిగిన వారికి కనీసం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. తాము చేసిన పోరాటానికి ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చి.. ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి కసరత్తు మొదలుపెట్టిందన్నారు. సమావేశాలతో కాలయాపన చేయకుండా.. ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాల పంపిణీని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసం ప్రజలను మభ్యపెట్టడానికి నాన్చుడు ధోరణి అవలంబిస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు.
Ancient Human Signs : యూరోపియన్ గుహలో పాతరాతి యుగపు మానవ సంకేతాలు