1. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు ఈడీ విచారణ. నేటితో ముగియనున్న అరుణ్‌పిళ్లై ఈడీ కస్టడీ.
2. నేడు బుచ్చిబాబును కూడా విచారణకు పిలిచిన ఈడీ. ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్న కల్వకుంట్ల కవిత. మనీష్ సిసోడియాతో కలిసి కవితను విచారించనున్న ఈడీ. ఢిల్లీలో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు.
3. నేడు అవినాష్‌రెడ్డిని మరోసారి విచారించనున్న సీబీఐ. వివేకా హత్యకేసులో మరోసారి విచారణ. ఇప్పటికే అవినాష్‌ను నాలుగుసార్లు విచారించిన సీబీఐ.
4. హైదరాబాద్ ఏఈ పేపర్ లీక్ కేసులో నేడు కస్టడీ పిటిషన్‌పై కోర్టులో విచారణ. నిందితులను 10 రోజుల కస్టడీకి కోరిన పోలీసులు.
5. నేటి నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించనున్న పాదయాత్ర.
6. తెలుగు రాష్ట్రాల్లో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్. హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్.
7. నేడు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్సీ కవిత ప్రెస్‌మీట్. తనపై వస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇవ్వనున్న కవిత.
8. నేడు శాసనసభలో ఏపీ బడ్జెట్. ఉదయం 8 గంటలకు కేబినెట్ ప్రత్యేక భేటీ. బడ్జె్‌ట్‌కు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టునున్న బుగ్గన.