బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో అత్యంత కీలకమైన నాలుగో టెస్టులో తొలి రోజు ఆతిథ్య ఆస్ట్రేలియానే ఆధిపత్యం చెలాయించింది. రెండో రోజులో కూడా ఆధిపత్యం చేయిస్తోంది. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 454/7 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (139), మిచెల్ స్టార్క్(15)లు క్రీజులో ఉన్నారు. మొదటి రోజు యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (60; 65 బంతుల్లో 6×4, 2×6), స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (72; 145 బంతుల్లో 7×4)లు హాఫ్ సెంచరీలు బాదారు. అయితే…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఆఫ్‌స్టంప్ ఆవల పడే బంతులను వెంటాడి మరీ ఔట్ అవుతున్నాడు. ట్రోఫీలో ఓ సెంచరీ మినహా అన్ని ఇన్నింగ్స్‌లలో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దాంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. గురువారం నుంచి మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ మాథ్యూ హేడెన్ కీలక సూచన చేశాడు. ఆఫ్‌సైడ్ బంతులను వదిలేసే విషయంలో…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా గురువారం నుంచి మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్ట్ కీలకంగా మారింది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, భారత్ జట్లు బలమైన జట్లతో బరిలోకి దిగుతున్నాయి. బాక్సింగ్ డే టెస్టు కోసం ఆసీస్ తన తుది జట్టును…
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు. అక్షర్ సతీమణి మేహా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అక్షర్ మంగళవారం (డిసెంబర్ 24) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. కుమారుడికి భారత జెర్సీ వేసి తీసిన ఫొటోను షేర్ చేశాడు. డిసెంబర్ 19న తనకు కొడుకు పుట్టాడని, హక్ష్ పటేల్ అని పేరు కూడా పెట్టినట్లు అక్షర్ వెల్లడించాడు. అక్షర్‌కు ఫాన్స్ విషెష్ తెలియజేస్తున్నారు. అక్షర్ పటేల్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా కాకుండా.. మిడిలార్డర్లో ఆడుతున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టులో కేఎల్ రాహుల్ రాణించడంతో.. హిట్‌మ్యాన్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు టెస్టుల్లో రోహిత్ విఫలమయ్యాడు. మిడిలార్డర్లో హిట్‌మ్యాన్ విఫలమవుతుండడంతో తిరిగి ఓపెనర్ అవతారం ఎత్తుతాడా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. దీనిపై రోహిత్‌ను ప్రశ్నిస్తే.. తాను జవాబు చెప్పను అని తెలిపాడు. గురువారం ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు ఆరంభం…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమవుతున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు దూరమైన హిట్‌మ్యాన్.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో దారుణ ప్రదర్శన చేశాడు. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ సక్సెస్ అవ్వడంతో.. రోహిత్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి వరుసగా 3, 6, 10 రన్స్ చేశాడు. దాంతో హిట్‌మ్యాన్ మళ్లీ ఓపెనర్‌గా ఆడాలని పలువురు మాజీలు సూచించారు. అయితే భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్…
గబ్బా టెస్టులో చివరి రోజు వేగంగా ఆడి భారత జట్టును ఇరుకున పెడదామనుకున్న ఆస్ట్రేలియాకు నిరాశే మిగిలింది. వరణుడి రాకతో ఐదవ రోజులో రెండు సెషన్ల ఆట సాగలేదు. వర్షం రావడంతో పాటు టెయిలెండర్లు ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాల పోరాటంతో భారత్ ఫాలో ఆన్ గండం నుంచి బయటపడి.. డ్రా చేసుకోగలిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆకాశ్ దీప్ (31 పరుగులు) దూకుడుగా ఆడి.. బుమ్రాతో కలిసి చివరి వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. గబ్బా పోరాటం…
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్ 1-1తో సమంగా ఉంది. పెర్త్ టెస్ట్ భారత్, అడిలైడ్ టెస్ట్ ఆసీస్ గెలవగా.. బ్రిస్బేన్ టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇక ఈ నాలుగో టెస్టు గురువారం (డిసెంబర్ 26) నుంచి ఆరంభమవుతుంది. మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. మెల్‌బోర్న్‌లో గెలిచిన జట్టు సిరీస్‌లో ఆధిక్యం సంపాదించనుంది. అయితే ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌ను…
ఆస్ట్రేలియాపై మంచి రికార్డు కలిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈసారి మాత్రం నిరాశ పర్చుతున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు భారీ స్కోరు సాధించిన పిచ్‌పై సీనియర్ అయిన విరాట్.. తన బలహీనతతో ఔట్ కావడం అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని ఆడి మరీ వికెట్ కీపర్‌కు దొరికిపోయాడు. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇలా ఔట్ కావడం మూడోసారి. దీంతో కోహ్లీపై భారత…
బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులు చేయగా.. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఈ టెస్టులో భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఆకాశ్ దీప్ 29.5 ఓవర్లలో 95 రన్స్ మాత్రమే ఇచ్చి ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతేకాదు పిచ్‌కు అవతల చాలా…