బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులు చేయగా.. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఈ టెస్టులో భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఆకాశ్ దీప్ 29.5 ఓవర్లలో 95 రన్స్ మాత్రమే ఇచ్చి ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతేకాదు పిచ్‌కు అవతల చాలా బంతులను విసిరాడు. దాంతో కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్సీ కేరీ బ్యాటింగ్ చేస్తుండగా.. 114వ ఓవర్‌ను ఆకాశ్ డీప్ వేశాడు. వికెట్లకు చాలా దూరంగా.. పిచ్‌కు అవతల బంతిని విసిరాడు. బంతిని అందుకోవడానికి వికెట్ కీపర్ రిషబ్ పంత్ చాలా కష్టపడ్డాడు. వెంటనే ఫీల్డ్ అంపైర్ వైడ్‌గా ఇచ్చాడు. దీంతో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. ‘నీ బుర్రలో ఏమైనా ఉందా?’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. రోహిత్ వ్యాఖ్యలు అక్కడి స్టంప్ మైక్స్‌లో రికార్డయ్యాయి. ఆ వీడియోను స్టార్ స్పోర్ట్స్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Also Read: IND vs AUS: ముగిసిన మూడో రోజు ఆట.. భారత్ స్కోర్ 51/4! వర్షం పడకుంటే మరిన్ని ఢమాల్
మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (33), రోహిత్ శర్మ (0) క్రీజులో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌కు టీమిండియా ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు పడగొట్టగా.. జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101)లు సెంచరీలు చేశారు.
Rohit Sharma & Stump-mic Gold – the story continues… 😅#AUSvINDOnStar 👉 3rd Test, Day 3 LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/vCW0rURX5q
— Star Sports (@StarSportsIndia) December 16, 2024