Axar Patel: తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్.. విషయం ముందే చెప్పిన రోహిత్!
- తండ్రైన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్
- అక్షర్‌కు ఫాన్స్ విషెష్
- విషయం ముందే చెప్పిన రోహిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు. అక్షర్ సతీమణి మేహా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అక్షర్ మంగళవారం (డిసెంబర్ 24) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. కుమారుడికి భారత జెర్సీ వేసి తీసిన ఫొటోను షేర్ చేశాడు. డిసెంబర్ 19న తనకు కొడుకు పుట్టాడని, హక్ష్ పటేల్ అని పేరు కూడా పెట్టినట్లు అక్షర్ వెల్లడించాడు. అక్షర్‌కు ఫాన్స్ విషెష్ తెలియజేస్తున్నారు.
అక్షర్ పటేల్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో బీసీసీఐ సెలక్టర్లు అక్షర్‌ను ఎంపిక చేయలేదు. మూడో టెస్ట్ అనంతరం వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. మిగిలిన రెండు టెస్టులకు అక్షర్‌తో భర్తీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే అక్షర్ పితృత్వ సెలవుల్లో ఉండడంతో.. తనుష్ కోటియన్‌ను ఎంపిక చేశారు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Also Read: IND vs AUS: ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పను: రోహిత్ శర్మ
మంగళవారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ అశ్విన్ స్థానంలో కొటియన్‌ను తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. అక్షర్ తండ్రయ్యాడని, ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే స్థితిలో లేడని చెప్పాడు. ఇక అక్షర్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో తిరిగి మళ్లీ భారత జట్టులోకి వచ్చే ఆకాశం ఉంది. అక్షర్ ఇప్పటివరకు భారత్ తరఫున 14 టెస్టులు, 60 వన్డేలు, 66 టీ20లు ఆడాడు.
He’s still figuring out the off side from the leg, but we couldnt wait to introduce him to all of you in blue. World, welcome Haksh Patel, India’s smallest, yet biggest fan, and the most special piece of our hearts.
19-12-2024 🩵🧿 pic.twitter.com/LZFGnyIWqM— Axar Patel (@akshar2026) December 24, 2024
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..