AUS vs IND: రోహిత్ ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి అదొక్కటే మార్గం: రవిశాస్త్రి
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విఫలమవుతున్న రోహిత్
- మూడు ఇన్నింగ్స్‌లలో 3, 6, 10 రన్స్
- హిట్‌మ్యాన్ ఆరో స్థానంలోనే బ్యాటింగ్ చేయాలంటున్న రవిశాస్త్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమవుతున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు దూరమైన హిట్‌మ్యాన్.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో దారుణ ప్రదర్శన చేశాడు. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ సక్సెస్ అవ్వడంతో.. రోహిత్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి వరుసగా 3, 6, 10 రన్స్ చేశాడు. దాంతో హిట్‌మ్యాన్ మళ్లీ ఓపెనర్‌గా ఆడాలని పలువురు మాజీలు సూచించారు. అయితే భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం ఆరో స్థానంలోనే రోహిత్ బ్యాటింగ్ చేయాలని అంటున్నాడు.
ఐసీసీ రివ్యూస్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌పై రవిశాస్త్రి స్పందించాడు. ‘రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఆడినా ఇబ్బంది లేదు. మూడో టెస్టులోనే ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని అడిగా. అయితే కేఎల్ రాహుల్ ఆటతో నా అభిప్రాయం మారింది. ఓపెనర్‌గా రాహుల్ ఆటను ఆస్వాదిస్తున్నాడు. అతడి టెక్నిక్ కూడా బాగుంది. ఏ బంతిని వదిలేయాలి, ఏ బంతిని ఆడాలనే విషయంపై పూర్తి అవగాహనతో ఉన్నాడు. కవర్ డ్రైవ్స్‌ను ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడు. రోహిత్ ఓపెనర్‌గా రావాలనుకోవడంలో తప్పేం లేదు. కానీ అతడు వ్యూహాలను కాస్త మార్చుకుంటే ఆరో స్థానంలో అత్యంత డేంజరస్ బ్యాటర్ అవుతాడు. గతంలోనూ రోహిత్‌కు ఆరో స్థానంలో ఆడిన అనుభవం ఉంది’ అని రవిశాస్త్రి చెప్పాడు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Also Read: AUS vs IND: గబ్బాలో పోరాటం.. ఆకాశ్ దీప్ ఆసక్తికర విషయాలు!
‘మిడిలార్డర్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు చేస్తే మైండ్‌సెట్ కూడా మారాలి. రెడ్‌బాల్ క్రికెట్ ఆడడం లేదని హిట్‌మ్యాన్ భావించాలి. టీ20, వన్డే క్రికెట్‌లో మాదిరిగా ఎటాకింగ్ చేయాలి. నా దృష్టిలో అతడు ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి ఇదే సరైన మార్గం. సాధారణంగా తొలి 15 నిమిషాలు క్రీజ్‌లో కుదురుకోవడానికి అందరూ ప్రయత్నిస్తుంటారు. కానీ రోహిత్ మాత్రం తొలి బంతి నుంచే బాదుడు మొదలెట్టాలి. ఆరో స్థానంలో వచ్చే బ్యాటర్లు ఎక్కువగా ఎటాకింగ్ ఆడతారు. ఒకవేళ వికెట్లు త్వరగా పడినప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతారు. హిట్‌మ్యాన్ మాత్రం దూకుడుగా ఆడితే పరిస్థితి మారే అవకాశం ఉంటుంది’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..