IPL 2022 సీజన్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా నిలిచింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్.. సంచలన ప్రదర్శనతో లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచి క్వాలిఫయర్-1, ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించి తొలి టైటిల్‌ను దక్కించుకుంది. ఏ ఒక్కరి ప్రదర్శనపైనో ఆధారపడకుండా సమష్టిగా రాణించింది. ప్రతీ మ్యాచ్‌కు ఒక్కో ప్లేయర్ సత్తా చాటడంతో అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్ చేరిన…
అప్పటివరకు టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ వేసే సరైన అల్ రౌండర్ లేడు. ఇర్ఫాన్ పఠాన్ తర్వాత అంతటి మేటి ఆటగాడు జట్టుకు కరువయ్యారు. అయితే అది 2015 IPL టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన ఒక బక్క పలచని కుర్రాడు ఆ సీజన్ లో అదరగొట్టేశాడు. అటు బౌలింగ్ లో ఇటు ధనాధన్ బ్యాటింగ్ లో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ జట్టుకు కీలక ఆల్ రౌండర్ గా మారిపోయాడు. ఏడాది తిరిగే…
మొదట్లో కాస్త చప్పగా సాగిన మ్యాచులు , తరువాత ఊపందుకొని చివరి మ్యాచ్ వరకు ఎవరు ప్లే ఆఫ్స్ కి చేసురుకుంటారని తెలియని ఒక ఉత్కంఠతో మొత్తానికి IPL 15వ సా సీజన్ ఘనంగా ముగిసింది. సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన ఆకట్టుకోలేకపోయిన, యువ ఆటగాళ్లు మాత్రం వారి స్థాయికి మించి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత జట్టుకు ఎవరిని సెలెక్ట్ చేయాలనీ అందరిని ఒక డైలమాలో పడేసారు . మొత్తానికి BCCI సెలక్షన్ కమిటీకి పెద్ద పరీక్షే పెట్టారు.…
భారత్,పాక్ మ్యాచ్ అంటేనే యుద్ధాన్ని తలిపిస్తుంది. ప్రతి బంతికి ఆధిపత్యం మారుతూ, నరాలు తెగే ఉత్కంఠ ను రేపుతోంది. అయితే భారత్,పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యములో కేవలం ICC టోర్నమెంట్‌లోనే ఈ దాయాదుల పోరును చూడాల్సివస్తోంది. అయితే భారత్, పాకిస్థాన్ జట్ల ప్లేయర్లు ఇండియా – పాక్ మ్యాచ్‌లు జరగాలని, అందులో తాము కూడా ఆడాలని కోరుకుంటున్నారని పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ పేర్కొన్నాడు. కానీ ఇరు దేశాల మధ్య రాజకీయ సమస్యల…
IPL 2022 మొదట వరుసగా 5 మ్యాచుల్లో గెలిచి జోరు మీద కనిపించినప్పటికీ తరువాత వరుస ఓటములతో కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేక అభిమానులను నిరాశపరిచి, సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది.. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 విజయాలు మాత్రమే నమోదు చేసి 8వ స్థానంలో నిలిచింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ వైఫల్యం జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు.…
భారత యువ బౌలర్ దీపక్ చాహర్ మొత్తానికి ఓ ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన జయ భరద్వాజ్‌ను పెళ్లాడాడు. నిన్న ఆగ్రాలో వీరి వివాహం జరిగింది. గత ఏడాది జరిగిన IPL 2021లో CSK చివరి మ్యాచ్ తర్వాత 29 ఏళ్ల ఈ యువ ఆటగాడు గ్రౌండ్ లోనే జయకు ప్రపోజ్ చేశాడు. అయితే మొత్తానికి అతను మనసు పడ్డ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. దీపక్ తన ఇన్స్టాగ్రామ్ నుండి తన పెళ్లి ఫోటోలను పంచుకున్నాడు. మీ అందరి…
IPL అంటే ఒకప్పుడు CSK జట్టుతో ఏ జట్టు ఫైనల్ ఆడుతుందో దాన్నే IPL అని అంటారు అనే స్థాయిలో ఆ జట్టు IPL ని ఒక ఊపు ఊపింది. అయితే ఇదంతా ఒకప్పటిమాట తాజాగా జరిగిన IPL 2022 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ గా ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమై అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలే సాధించిన CSK పాయింట్స్…
తాను కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేయడమే ఆలస్యం.. అతడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడా? అనే చర్చలు జాతీయంగా మొదలైపోయాయి. ఆల్రెడీ గంగూలీ పలుసార్లు కేంద్ర హోంమంత్రిని కలవడం, ముఖ్యంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ఆయన రావడంతో.. గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని, ఆయన బీజేపీలో చేరనున్నారని దాదాపు అందరూ ఫిక్సయ్యారు. అతని చేసిన ట్వీట్లో ‘చాలామందికి ఉపయోగపడే ఓ మహత్తర కార్యక్రమానికి తెరతీస్తున్నా’ అని పేర్కొనడం.. రాజకీయ అరంగేట్ర ప్రచారానికి మరింత…
అంతర్జాతీయ క్రికెట్లో విప్లవాత్మక మార్పులు రావాలని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అంటున్నాడు. ద్వైపాక్షిక సిరీసులు ఆడకుండా ఇకనుండి ఏడాదికి రెండుసార్లు IPL నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాడు. ICC T20 ప్రపంచకప్ ఫైనళ్లను తప్ప మిగతా మ్యాచుల్ని ఎవరైనా గుర్తు పెట్టుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ‘ఏడాదికి రెండు IPL సీజన్లే భవిష్యత్తు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఫ్రాంచైజీ క్రికెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. రెండు సీజన్లకు 70-70గా విభజించొచ్చు’ అని రవిశాస్త్రి అన్నాడు. ఆటగాళ్లపై ద్వైపాక్షిక…
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లను పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ల ఆధారంగా ఆయన త్వరలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రాజకీయరంగ ప్రవేశం చేస్తే గంగూలీ ఖచ్చితంగా బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఈ అంశంపై గతనెలలో రెండు సార్లు గంగూలీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మే 8న గంగూలీ ఇంట్లో అమిత్ షా విందుకు…