దాదా.. సౌరవ్ గంగూలీని అభిమానులు పిలుచుకునే ముద్దుపేరు. టీమిండియా మాజీ సారథిగా, బీసీసీఐ బాస్ గా సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) తనదైన ముద్ర వేశాడు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో గంగూలీ మౌనం వీడాడు. 2019లో బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన గంగూలీ(Sourav Ganguly) రెండో విడత కొనసాగేందుకు విముఖత చూపించినట్టు, అతడిని రెండోసారి కొనసాగించడం కొందరు పెద్దలకు ఇష్టం లేదని.. ఇలా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గంగూలీ వ్యవహారం రాజకీయంగానూ కాకరేపింది. ఎల్లకాలం ఆడడం సాధ్యం కాదని, అలాగే ఎల్లకాలం అడ్మినిస్ట్రేటర్‌గానూ ఉండలేరని కుండబద్దలుగొట్టాడు. తాను క్రికెట్ ఆడుతున్నప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని పెద్ద విషయాలపై దృష్టిసారించనున్నట్టు చెప్పాడు. క్రీడా జీవితంలోని 15 ఏళ్లు మాత్రం నిస్సంకోచంగా చాలా గొప్పవని గంగూలీ పేర్కొన్నాడు. ఒక్కరోజులో మోడీ కాలేరని హాట్ కామెంట్స్ చేశారు.