Jay Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి పదవిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జై షాపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జాతీయ పతాకాన్ని జై షా అవమానించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి గెలిపించడంతో స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు, సెలబ్రెటీలు సంబరాలు చేసుకున్నారు.…
IND Vs ZIM: ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలియజేసింది. ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతుండగా వాషింగ్టన్ సుందర్ భుజానికి గాయమైంది. ఆగస్టు 10న ఓల్డ్ ట్రాఫోర్డులో లాంక్షైర్కు ఆడుతూ ఓ మ్యాచ్‌లో డైవ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అతడు జింబాబ్వే టూర్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం సుందర్ రిహాబిలిటేషన్ కోసం బెంగళూరులోని…
bcci introduced new category for umpires: అంపైర్ల కోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అంపైరింగ్‌లో సమర్ధత ఆధారంగా నాలుగు కేటగిరీలు ఉండేవి. ఉత్తమ పనితీరు ఆధారంగా ‘ఏ’, ‘బి’, ‘సి’, ‘డి’ కేటగిరీల ద్వారా అంపైర్లకు స్థానం కల్పించేవారు. అయితే కొత్తగా అంపైరింగ్ విధులను అత్యంత సమర్థతతో నిర్వర్తించే వాళ్ల కోసం బీసీసీఐ కొత్త కేటగిరీ ఏ+ ఏర్పాటు చేసింది. కొత్త కేటగిరి ఏ+లో 11 మంది అంపైర్లకు స్థానం కల్పించింది. ఈ…
Team India Reached West indies: టీమిండియా వరుసబెట్టి సిరీస్‌ల మీద సిరీస్‌లు ఆడుతోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్ట్, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడిన టీమిండియా వచ్చే శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం భారత జట్టు వెస్టిండీస్ చేరుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగే తొలి వన్డే కోసం జట్టు ట్రినిడాడ్ చేరిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సీనియర్ క్రికెటర్లంతా ఈ సిరీస్‌కు…
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శుక్రవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా తమ రాజ్యాంగంలోని కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను తొలగిస్తూ 2019 డిసెంబరులో చేసిన సవరణలను ఆమోదించాలంటూ 2019లో దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని తన పిటిషన్లో బీసీసీఐ పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు అంగీకారం తెలపడంతో వచ్చేవారం విచారణ తెలపనుంది. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జై షా పదవీకాలం సెప్టెంబరుతో ముగియనుంది. Read Also: Telangana: తెలంగాణలో…
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. విదేశాలకు చెందిన ప్రముఖ ఆటగాళ్లు ఓ జట్టుగా, అగ్రశ్రేణి భారత ఆటగాళ్లు మరో జట్టుగా మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇండియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య ఆగస్టు 22న మ్యాచ్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు మ్యాచ్ నిర్వహణపై బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు వెల్లడించారు. Read Also:…
ఆగస్టులో శ్రీలంక వేదికగా ఆసియా కప్ 2022 టోర్నీ జరగనుంది. అయితే ఇదే సమయంలో జింబాబ్వేలో మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా పర్యటించాల్సి ఉంది. ఒకే సమయంలో రెండు పర్యటనలు ఉండటంతో ఆసియా కప్‌కు రోహిత్ శర్మ సారథ్యంలోని సీనియర్ల జట్టును, జింబాబ్వేకు జూనియర్ల జట్టును పంపించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఆసియా కప్‌లో పాల్గొనే టీమ్‌కు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా.. జింబాబ్వే పర్యటనకు వెళ్లే బీ టీమ్‌కు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.…
ఒకప్పుడు రన్ మెషీన్‌గా ఓ వెలుగు వెలిగిన విరాట్ కోహ్లీ.. కొంతకాలం నుంచి ఆ స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. అవకాశాల మీద అవకాశాలు ఇస్తోన్నా.. వాటిని సద్వినియోగపరచుకోవడం లేదు. మూడేళ్ల నుంచి సెంచరీ కూడా చేయలేదు. రీసెంట్గా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లోనూ ఫెయిలయ్యాడు. దీంతో కోహ్లీపై వేటు తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కోహ్లి రాణించకపోతే.. అదే అతని ఆఖరి సిరీస్ అవుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ…