టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్‌ను జూన్ 1న ఆగ్రాలో కుటుంబ సభ్యుల సమక్షంలో దీపక్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జయ భరద్వాజ్‌కు చాహర్ ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా సంతోషంగా అంగీకరించడంతో.. ఏడాది పాటు ఈ జంట ప్రేమ మత్తులో మునిగి తేలింది. గాయంతో దీపక్ చాహర్ క్రికెట్ కెరీర్‌కు బ్రేక్ రావడంతో వివాహం చేసుకున్నారు. ఆగ్రాలో…
సుమారు రెండున్నర నెలలపాటు అలరించిన IPL 2022 సీజన్ దిగ్విజయంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి అప్‌కమింగ్ భారత్-సౌతాఫ్రికా T20 సిరీస్‌పై నెలకొంది. సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకున్న వేళ ఐపీఎల్లో మెరిసిన స్టార్లతో టీమిండియా సొంతగడ్డపై సఫారీలతో అమీతుమీ తేల్చుకోనుంది. 5 T20ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జూన్ 9న ఢిల్లీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న T20 ప్రపంచకప్‌కు ఈ సిరీస్‌ను టీమిండియా…
ఏపీలో త్వరలో మరో క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ-20 టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోగో, టీజర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. సీఎం నివాసంలో సీఎం జగన్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూలై 6 నుంచి జూలై 17 వరకు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టోర్నమెంట్ జరగనుంది.…
IPL 2022 సీజన్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా నిలిచింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్.. సంచలన ప్రదర్శనతో లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచి క్వాలిఫయర్-1, ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించి తొలి టైటిల్‌ను దక్కించుకుంది. ఏ ఒక్కరి ప్రదర్శనపైనో ఆధారపడకుండా సమష్టిగా రాణించింది. ప్రతీ మ్యాచ్‌కు ఒక్కో ప్లేయర్ సత్తా చాటడంతో అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్ చేరిన…
అప్పటివరకు టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ వేసే సరైన అల్ రౌండర్ లేడు. ఇర్ఫాన్ పఠాన్ తర్వాత అంతటి మేటి ఆటగాడు జట్టుకు కరువయ్యారు. అయితే అది 2015 IPL టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన ఒక బక్క పలచని కుర్రాడు ఆ సీజన్ లో అదరగొట్టేశాడు. అటు బౌలింగ్ లో ఇటు ధనాధన్ బ్యాటింగ్ లో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ జట్టుకు కీలక ఆల్ రౌండర్ గా మారిపోయాడు. ఏడాది తిరిగే…
మొదట్లో కాస్త చప్పగా సాగిన మ్యాచులు , తరువాత ఊపందుకొని చివరి మ్యాచ్ వరకు ఎవరు ప్లే ఆఫ్స్ కి చేసురుకుంటారని తెలియని ఒక ఉత్కంఠతో మొత్తానికి IPL 15వ సా సీజన్ ఘనంగా ముగిసింది. సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన ఆకట్టుకోలేకపోయిన, యువ ఆటగాళ్లు మాత్రం వారి స్థాయికి మించి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత జట్టుకు ఎవరిని సెలెక్ట్ చేయాలనీ అందరిని ఒక డైలమాలో పడేసారు . మొత్తానికి BCCI సెలక్షన్ కమిటీకి పెద్ద పరీక్షే పెట్టారు.…
భారత్,పాక్ మ్యాచ్ అంటేనే యుద్ధాన్ని తలిపిస్తుంది. ప్రతి బంతికి ఆధిపత్యం మారుతూ, నరాలు తెగే ఉత్కంఠ ను రేపుతోంది. అయితే భారత్,పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యములో కేవలం ICC టోర్నమెంట్‌లోనే ఈ దాయాదుల పోరును చూడాల్సివస్తోంది. అయితే భారత్, పాకిస్థాన్ జట్ల ప్లేయర్లు ఇండియా – పాక్ మ్యాచ్‌లు జరగాలని, అందులో తాము కూడా ఆడాలని కోరుకుంటున్నారని పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ పేర్కొన్నాడు. కానీ ఇరు దేశాల మధ్య రాజకీయ సమస్యల…
IPL 2022 మొదట వరుసగా 5 మ్యాచుల్లో గెలిచి జోరు మీద కనిపించినప్పటికీ తరువాత వరుస ఓటములతో కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేక అభిమానులను నిరాశపరిచి, సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది.. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 విజయాలు మాత్రమే నమోదు చేసి 8వ స్థానంలో నిలిచింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ వైఫల్యం జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు.…
భారత యువ బౌలర్ దీపక్ చాహర్ మొత్తానికి ఓ ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన జయ భరద్వాజ్‌ను పెళ్లాడాడు. నిన్న ఆగ్రాలో వీరి వివాహం జరిగింది. గత ఏడాది జరిగిన IPL 2021లో CSK చివరి మ్యాచ్ తర్వాత 29 ఏళ్ల ఈ యువ ఆటగాడు గ్రౌండ్ లోనే జయకు ప్రపోజ్ చేశాడు. అయితే మొత్తానికి అతను మనసు పడ్డ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. దీపక్ తన ఇన్స్టాగ్రామ్ నుండి తన పెళ్లి ఫోటోలను పంచుకున్నాడు. మీ అందరి…
IPL అంటే ఒకప్పుడు CSK జట్టుతో ఏ జట్టు ఫైనల్ ఆడుతుందో దాన్నే IPL అని అంటారు అనే స్థాయిలో ఆ జట్టు IPL ని ఒక ఊపు ఊపింది. అయితే ఇదంతా ఒకప్పటిమాట తాజాగా జరిగిన IPL 2022 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ గా ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమై అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలే సాధించిన CSK పాయింట్స్…