ఐపీఎల్ 2022 సీజన్ తుది అంకానికి చేరుకుంటోంది. ప్రస్తుతం లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ప్లే ఆఫ్స్‌లో మూడు స్థానాల గురించి క్లారిటీ రాగా.. మరో స్థానం కోసం మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ స్థానాలను కైవసం చేసుకున్నాయి. నాలుగో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ…
2007లో టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత కెప్టెన్‌గా ఎంతో మంది సీనియర్లను కాదని బీసీసీఐ ధోనీని నియమించింది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌కు సీనియర్లు దూరంగా ఉండటంతో యువరాజ్‌కు కెప్టెన్సీ ఇస్తారని అందరూ భావించారు. అయితే బీసీసీఐ అనూహ్యంగా ధోనీకి పగ్గాలు ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐపై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. 2007లో తాను కెప్టెన్ కావాల్సిందని.. కానీ అప్పుడు గ్రెగ్ ఛాపెల్ ఘటన జరిగిందని.. అది…
ఐపీఎల్ 2022 సీజన్ చప్పగా ప్రారంభమైనా ప్రస్తుతం రంజుగా కొనసాగుతోంది. ఈ ఏడాది జట్ల సంఖ్య పెరిగినా మ్యాచ్‌ల సంఖ్య మాత్రం 74గానే ఉంది. వీటిలో 70 లీగ్ మ్యాచ్‌లు ఉండగా మిగతా నాలుగు మ్యాచ్‌లు ప్లే ఆఫ్స్ కిందకు వస్తాయి. కరోనా కారణంగా లీగ్ మ్యాచ్‌లను మహారాష్ట్రలోని నాలుగు స్టేడియాల్లో మాత్రమే బీసీసీఐ నిర్వహిస్తోంది. ప్రస్తుతం లీగ్ దశలో సగం మ్యాచ్‌ల సంఖ్య పూర్తి కావడంతో బీసీసీఐ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వేదికలను ఖరారు చేసింది.…
ఐపీఎల్ ప్రసార మ్యాచ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రసార హక్కులను చేజిక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీ పడుతుంటాయి. ఈ మేరకు 2023-2027 నాలుగేళ్ల కాలానికి ప్రసార హక్కుల కోసం బీసీసీఐ త్వరలో టెండర్లను పిలవనుంది. అయితే ఈ టెండర్లు పిలవకముందే బీసీసీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ వీక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు రిపోర్టులు వచ్చాయి. గత ఏడాదితో పోల్చుకుంటే తొలివారం వీక్షకుల సంఖ్య 33 శాతం పడిపోయింది. బార్క్ నివేదిక ప్రకారం గత…
ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 210/6 స్కోర్ చేయగా.. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుటైన విధానంపై దుమారం రేగుతోంది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో విలియమ్సన్ క్యాచ్ అవుట్ అయ్యాడని థర్డ్ అంపైర్ ప్రకటించాడు. అయితే…
ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త అందించింది. ఐపీఎల్ 2022 మ్యాచ్‌లను ప్రత్యక్షంగా స్టేడియాలలో చూసేందుకు అభిమానులకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం 25 శాతం ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటన చేసింది. దీంతో రెండేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లను క్రీడాభిమానులకు స్వయంగా వీక్షించే అవకాశం దక్కనుంది. ఇప్పటికే ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మార్చి 23 మధ్యాహ్నం నుంచి టిక్కెట్ సేల్స్ ప్రారంభమైనట్లు ఐపీఎల్ పాలకమండలి వెల్లడించింది. కాగా ఐపీఎల్ 15వ సీజన్లో…
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్‌గా పేరుపొందిన విరాట్ కోహ్లీ ఇప్పుడు క్రికెట్ ప్రేమికులను నిరాశపరుస్తున్నాడు.. శ్రీలంకతో రెండో టెస్టులో విరాట్ కోహ్లి అవుటైన తీరు ఇది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఎలా అవుటయ్యాడో.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సేమ్ టు సేమ్. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌లో అవుటైతే.. రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్‌కు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. విరాట్ కోహ్లి ఇప్పటివరకు 101 టెస్టులు ఆడాడు. వందో టెస్టులో 45 పరుగులు చేసిన విరాట్.. ఇక…
క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే వార్త అందించింది. బీసీసీఐ పాలకమండలి ఆదివారం సాయంత్రం ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 26న ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. కరోనా పరిస్థితుల కారణంగా భారత్‌లోని రెండే నగరాల్లో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని మూడు స్టేడియాలు, పూణెలోని ఓ స్టేడియంలో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఐపీఎల్-15లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం 65 రోజుల పాటు…
బీసీసీఐ, విరాట్ కోహ్లీ మధ్య వివాదం నడుస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. సమస్య తలెత్తినప్పుడు కాయిన్‌కు ఒక వైపే చూడొద్దని.. రెండు వైపులా చూడాలని హితవు పలికాడు. సమస్యను చూస్తుంటే ముందుకు వెళ్లలేమని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అలా చూస్తే అద్భుత విజయాలు సాధించలేమని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీతో తాను ఎన్నో ఏళ్లుగా ప్రయాణం చేశానని..…
ఈ ఏడాది ఐపీఎల్ మెగా టోర్నీ మార్చి 26న ప్రారంభం అవుతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా వెల్లడించారు. ఈ సీజన్లో మొత్తం 10 జట్లు సందడి చేయనున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో తొలిసారిగా బరిలోకి దిగబోతున్నాయి. 10 జట్లు కలిపి 74 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. వీటిలో 70 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్డేడియం, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనున్నాయి. వాంఖడే స్టేడియం, డీవై…