ఇండియన్ క్రికెట్ చరిత్రలో సౌరవ్ గంగూలీకి ప్రత్యేకమయిన స్థానం వుంది. మూడు సంవత్సరాల నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా తన దూకుడును కొనసాగించిన గంగూలీ ఇప్పుడు బీసీసీఐ నుంచి బయటకు వచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండుసార్లు సౌరభ్ గంగూలీ ఇంటికి వెళ్లారు. ఆ రెండుసార్లు సౌరభ్ భారతీయ జనతాపార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు షికారు చేసినా వాటిని గంగూలీ ఖండించాడు. రెండవసారి బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపడతాడని వార్తలు వచ్చినా గంగూలీన బెంగాల్ ఎన్నికల సమయంలోను, ఆ తర్వాత బీజేపీలో చేరమని ఒత్తిడి వచ్చిందని, కానీ అతను నిరాకరించాడని, అందుకే రెండోసారి అధ్యక్ష పదవికి ఎంపిక కాలేకపోయాడంటూ తృణమూల్ కాంగ్రెస్ అంటోంది.