నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు షురూ అవుతున్నాయి. తాజాగా.. కొలిమిగుండ్ల మండలంలో న్యూట్రల్‌గా ఉన్న 30 కుటుంబాలతో సహా.. 15 మంది వైసీపీ దళిత నేతలు, ఎర్రబోతుల కుటుంబానికి చెందిన కీలక నేత కూడా బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం కొలిమిగుండ్ల మండలంలో జరిగిన చేరికల కార్యక్రమంలో భాగంగా.. గత కొన్నేళ్లుగా స్థానిక రాజకీయాల్లో…
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. నా తల్లిదండ్రుల సాక్షిగా మాట ఇస్తున్నాను.. బనగానపల్లెలో పేదలకు నా సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం ఇచ్చి తీరుతా! అని వెల్లడించారు. నేను బనగానపల్లె ప్రజలకు రుణపడి ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు.
ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజ్యమేలిన ఆ గడ్డపై ఇప్పుడు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయి. హత్యారాజకీయాలతో అట్టుడుకిపోయిన ఆ నేల ఇప్పుడు దైవ నామస్మరణలతో మార్మోగిపోతుంది. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన ఆ నాయకుడు... ప్రజలకు సేవ చేయడమే కాదు... లెక్కకు మించిన దాన ధర్మాలు, గుప్తదానాలు చేస్తూ ధార్మిక సేవలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. ఆయనే బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి. బనగానపల్లెలో ధర్మ పరిరక్షణకు బీసీ జనార్థన్…
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో షాదీఖానా చుట్టూ రాజకీయం తిరుగుతోంది. కోవెలకుంట్ల పట్టణంలో షాదీఖానా విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి జరుగుతోంది. షాదీఖానా పేరుతో మభ్యపెట్టి, కమ్యూనిటీ హాల్ నిర్మించి మోసం చేసినందుకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముస్లింలకు క్షమాపణ చెప్పాలని బీసీ జనార్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా తమ సత్తా చాటుకోవాలి అన్న దృఢ సంకల్పంతో బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేపట్టి ఇంటి ఇంటికి..గడపగడపకి తిరుగుతున్నారు టీడీపీ నేతలు. ఈసారి తమ ప్రభుత్వం రూలింగ్‌లోకి వస్తే ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అన్న విషయాన్ని అందరికీ వివరిస్తూ.. అందరికంటే యాక్టివ్‌గా ముందుకు సాగుతున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి నాయకత్వానికి మద్ధతుగా ఇతర పార్టీల నుంచి వలసలు షురూ అయ్యాయి. తాజాగా కొలిమిగుండ్లలో అధికార వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఈరోజు (ఆదివారం) బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో వైసీపీ కీలక నేత, కొలిమిగుండ్ల పట్టణ ఉపసర్పంచ్ పెద్ద నాగయ్య ఆధ్వర్యంలో గిత్తన్న గారి నాగేశ్వరావు, కుళ్ళే నాగకుళాయి, తలారి శ్రీనివాసులు, తలారి చెన్నకేశవ, తలారి చంద్రగోపాల్,…
ఎన్నికలకు ముందు నంద్యాల జిల్లా బనగానపల్లె నరియోజకవర్గంలో నివురుగప్పిన నిస్పులా సెగలు కక్కుతున్న రాజకీయం ఇప్పుడు మంటలు పుట్టిస్తొంది.. షాదీఖానా నిర్మాణం విషయంలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డికి మద్య జరుగుతున్న వార్ పీక్స్‌కు చేరింది.
జగన్ రెడ్డి పాలనలో కేవలం రాజకీయ నిరుద్యోగల కోసమే బీసీ కార్పొరేషన్లు పెట్టారు.. బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు పేరుకే బీసీలు.. అధికార పెత్తనం అంతా వైసీపీ అగ్ర కుల పెద్దలదే అని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మండిపడ్డారు.
బీసీలకు అండగా ఉంటామని చెప్పి, అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం బీసీలను హత్యలు చేస్తూ, అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తుందని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. కొలిమిగుండ్లలో టీడీపీ బీసీ నాయకుడిని చంపిన వారికి శిక్ష పడేవరకు వదిలేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ బీసీలలో రాజకీయ చైతన్యం కల్పిస్తే,..బీసీ కులాల సంక్షేమానికి పాటుపడి, వారికి గుర్తింపు తీసుకువచ్చింది చంద్రబాబు అని అన్నారు. బీసీ కులాల నాయకులకు…
ముఖ్యమంత్రి జగన్ పథకాల పేరుతో ప్రజలను దగా చేసాడని.. ఈసారి జగన్ మాయమాటలు నమ్మి ఓటేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లేనని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటాపురం, పండ్లపురం గ్రామాల్లో పర్యటించిన బీసీ జనార్థన్ రెడ్డి.. బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నాలుగున్నరేళ్లలో కరెంటు బిల్లులు మూడు రెట్లకు పైగా…