ఎన్నికల ప్రచారంలో బీసీ జనార్థన్ రెడ్డి కుటుంబ సభ్యులు దూసుకుపోతున్నారు. బీసీ జనార్థన్ రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి, కుమార్తె, కోడలు, సోదరులంతా ఏకమై ఊరూరా ఇంటింటికి తిరుగుతూప్రజలతో మమేకవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీసీ కుటుంబ సభ్యుల ప్రచారానికి ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. మరోవైపు.. ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలు టీడీపీ, వైపీపీ పోటాపోటీగా ప్రచారం చేస్తేన్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా…
ఎన్నికలకు గత కొంత కాలంగా సైలెంట్‌గా గ్రౌండ్ వర్క్ చేసిన బీసీ జనార్థన్ రెడ్డి సరిగ్గా ఎన్నికల కోడ్ వచ్చాక అదను చూసి వైసీపీని చావుదెబ్బ కొట్టారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంత గ్రామం అయిన తమ్మడపల్లెలో తొలిసారిగా బీసీ జనార్థన్ రెడ్డి పాగా వేసారు. గత 20 ఏళ్లుగా ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి నమ్మిన బంటుల్లాగా ఉంటున్న 20 మంది ముఖ్య అనుచరులు బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో…
బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్‌రెడ్డి.. నంద్యాల జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకోగా.. బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి.. గెలుపే దిశగా మరో ముందడుగు వేశారు.. ఈ రోజు కుటుంబసభ్యుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడిస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
కాటసాని రామిరెడ్డి సొంత ఇలాకా అయిన అవుకు మండలంలో చల్లా కుటుంబ సభ్యులతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలకు సోదరుడైన కాటసాని చంద్రశేఖర్ రెడ్డి లాంటి కీలకనేతతో సహా పలువురు కాటసాని బంధువులు టీడీపీలో చేరి.. బీసీ జనార్థన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల రేసులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన బీసీ జనార్థన్ రెడ్డి ఈసారి ఎలాగైనా బనగానపల్లెలో టీడీపీ జెండా ఎగురవేయాలని పట్టుదలగా ఉన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు మహానటులు..ఒకరిని మించి మరొకరు తమ నటనతో బనగానపల్లె ప్రజలకు మాంచి యాక్షన్ కామెడీ సినిమా చూపించారని, తమ అసమర్థతను తామే ఘనంగా చాటి చెప్పుకున్నందుకు ధన్యవాదాలు అని బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఆయనకు ప్రజలంటే ప్రాణం.. తనను నమ్ముకున్న ప్రజల కోసం తన సొంత ఆస్తులు ఖర్చు అయినా పర్లేదు.. వాళ్లు సంతోషంగా ఉంటే చాలనుకునే పెద్ద మనసు అయినది. కేవలం డబ్బు సంపాదన కోసమే రాజకీయాలకు వచ్చి.. అవినీతి, అక్రమాలతో వందల కోట్లు దోపిడీకి పాల్పడుతూ.. తరతరాలకు సరిపడా సంపాదించుకునే నాయకులు ఉన్న కాలంలో, పదవుల్లో ఉన్నా లేకపోయినా.. కష్టపడి సంపాదించిన వందల కోట్లను సేవాకార్యక్రమాలకు ఖర్చుపెడుతున్న నిస్వార్థ ప్రజాసేవకుడు బీసీ జనార్థన్ రెడ్డి.. నంద్యాల జిల్లా రాజకీయాల్లో…
ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి స్పీడ్ పెంచారు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పి వరుసగా సైకిలెక్కుతున్నారు.
నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఆ నాయకుడి రూటే సెపరేట్.. ఆయన ఒక్కసారి మాట ఇచ్చారంటే అంతే.. సొంతంగా ఎంత ఖర్చైనా పర్లేదు.. ప్రజల కోసం ఎన్ని కోట్లు ఖర్చు అయినా చేసి తీరాల్సిందే అని పంతం పడతారు.
2 దశాబ్దాలుగా బనగానపల్లె నియోజకవర్గం ప్రజల సేవకు టీడీపీ అంకితమైన కుటుంబం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి కుటుంబం. గతంలో బీసీ జనార్థన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి సర్పంచ్‌గా బనగానపల్లె పట్టణ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించారు. వ్యాపార వేత్తంగా పేరుగాంచిన బీసీ జనార్థన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే కరువు ప్రాంతమైన బనగానపల్లెలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టి పేదలను ఆదుకున్నారు. 2014 లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన తొలిసారే సిట్టింగ్…