BC Janardhan Reddy: కాటసాని రామిరెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి ఆగ్రహం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలకు ముందు నంద్యాల జిల్లా బనగానపల్లె నరియోజకవర్గంలో నివురుగప్పిన నిస్పులా సెగలు కక్కుతున్న రాజకీయం ఇప్పుడు మంటలు పుట్టిస్తొంది.. షాదీఖానా నిర్మాణం విషయంలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డికి మద్య జరుగుతున్న వార్ పీక్స్‌కు చేరింది.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో బనగానపల్లె రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. షాదీఖానా విషయంలో ఇరువురు నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొనసాగుతుంది.
Read Also: New Railway Line: తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. హైదరాబాద్- విజయవాడ తగ్గనున్న ప్రయాణ సమయం
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
గత కొన్నాళ్లుగా షాదీఖానా నిర్మాణం విషయంలో ఎస్‌ఆర్‌బీసీ బఫర్‌జోన్‌లో ఇళ్ల పట్టాల విషయంలో తనపై విమర్శలు చేస్తున్న వైసీనీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. షాదీఖానా నిర్మాణం విషయంలో బనగానపల్లె ముస్లింలకు కాటసాని రామిరెడ్డి చేస్తున్న మోసాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టి.. తనపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. బనగానపల్లె, కొలిమిగుండ్ల పట్టణాల్లో కమ్యూనిటీ హాళ్లకు శంకుస్థాపన చేసిన కాటసాని రామిరెడ్డి వాటిని షాదీఖానాలుగా పేర్కొంటూ ముస్లిం మత పెద్దలను కూడా మోసం చేస్తున్నారని బీసీ మండిపడ్డారు. ఈ మేరకు కమ్యూనిటీ హాళ్లకు సంబంధించిన ప్రభుత్వ జీవో ఉత్వర్తులను స్వయంగా ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన బీసీ జనార్థన్ రెడ్డి షాదీఖానాలకు, కమ్యూనిటీ హాళ్లకు తేడా తెలియదా.. ఆ మాత్రం దిమాక్ లేదా అంటూ కాటసాని రామిరెడ్డిని టీడీజీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి కడిగిపారేసారు
Read Also: Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. Live & Update
గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బనగానపల్లెలో షాదీఖానా నిర్మాణం కోసం కోటి రూపాయలు మంజూరు చేయడంతో పాటు సొంతంగా 30 లక్షలు, కమీటీ ద్వారా మరో 25 లక్షలు సమకూర్చానన్నారు. కేవలం కక్ష సాధింపుతో ఆల్రెడీ 60 శాతం పనులు పూర్తి అయిన షాదీఖానాను కంప్టీల్ చేయలేదని కాటసానిపై ఆయన విరుచుకుపడ్డారు. తాను సొంత డబ్బులతో షాధీఖానాను పూర్తి చేయడానికి ముందుకు వస్తే తనపై అక్రమ కేసులు పెట్టించావని కాటసానిపై ఫైర్ అయ్యారు. తక్షణమే బనగానపల్లె నియోజకవర్గంలో ముస్లింలకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి క్షమాపణ చెప్పాలని బీసీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తనపై లుచ్చా.. లోఫర్ అంటూ వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డ తీరుపై బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బనగానపల్లె నియోజకవర్గంలో షాదీఖానాపై లోఫర్ రాజకీయం చేస్తున్న లుచ్చా రాజకీయ నాయకుడు నువ్వు అంటూ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. త్వరలో నీ అవినీతి, అక్రమాలు అన్నింటిని బనగానపల్లె ప్రజల ముందు సాక్ష్యాధారాలతో సహా బయట పెడతానని ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డిని బీసీ జనార్థన్ రెడ్డి హెచ్చరించారు.
తాజావార్తలు
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!