Bangladesh: బంగ్లాదేశ్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. రిజర్వేషన్ కోటాకు నిరసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికీ రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చింది. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అక్కడ మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. దేశ అంతర్గత భద్రత తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అనేది ఆ దేశంలో లేనే లేదు. నిరసనల…
చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. కాగా.. హోంగ్రౌండ్లో అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. 108 బంతుల్లో శతకం సాధించాడు.
రేపు బంగ్లాదేశ్‌తో మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవవన్ని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఎంపిక చేశాడు. తన జట్టులో ఎవరిని చేర్చుకున్నాడో దినేష్ కార్తీక్ వెల్లడించాడు.
Bangladesh Reform: షేక్ హసీనాను అధికారం నుండి తొలగించిన తరువాత, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉన్న మహ్మద్ యూనస్ దేశంలో మార్పు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, మైనారిటీలపై హింసను దర్యాప్తు చేయడానికి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల పర్యవేక్షణ బృంధం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకి చేరుకుంది. నోబెల్ శాంతి గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా అక్కడ మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.
Bangladesh: బంగ్లాదేశ్ మరో పాకిస్తా్న్‌గా మారేందుకు ఆ దేశానికి దగ్గర అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి, ఇండియా పారిపోయి వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉగ్రవాదులు, రాడికల్ ఇస్లామిక్ భావాలు కలిగిన వ్యక్తులు తరుచుగా భారత వ్యతిరేక, పాక్ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా మహ్మద్ అలీ జిన్నా వర్ధంతి వేడుకలు ఢాకాలో జరిగాయి. వక్తులు జిన్నాని బంగ్లాదేశ్ జాతిపితగా పిలిచారు.
Indian Navy: బంగ్లాదేశ్ సంక్షోభం, ఈ ప్రాంతంలో అస్థిరత పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి భారత నావికాదళం టాప్ కమాండర్లు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
Bangladesh: ఒకప్పుడు దాయాది దేశం పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న బంగ్లాదేశ్(అప్పటి తూర్పు పాకిస్తాన్) ఏ లక్ష్యం కోసం స్వాతంత్య్రాన్ని తెచ్చుకుందో ఇప్పుడు ఆ లక్ష్యం మరుగునపడిపోతోంది. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మహ్మద్ అలీ జిన్నా, బెంగాలీ మాట్లాడే ప్రజలపై ఉర్దూ భాషను రద్దాలని చూడటమే బంగ్లాదేశ్ ఏర్పాటుకు మూలమైంది. అయితే, ఇప్పుడు షేక్ హసీనా దిగిపోయిన తర్వాత అక్కడ రాడికల్ ఇస్లామిస్టుల రాజ్యం నడుస్తోంది. జమాతే ఇస్లామీ వంటి మతఛాందస వాద సంస్థలకు కొత్త ప్రభుత్వం క్లీన్…
గంగానది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న లోతైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని వలన భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఆగడం లేదు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి అక్కడ మైనారిటీలు, వారి వ్యాపారాలు, ఆలయాలు, చర్చ్‌ల మీద దాడులు జరగుతూనే ఉన్నాయి. 15 రోజుల్లో దేశంలోని 49 జిల్లాల్లో 1000కి పైగా దాడులు జరిగాయి. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు మైనారిటీలపై మొత్తం 1068 దాడులు జరిగాయిని ఆ దేశంలోని ప్రముఖ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది.