భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈరోజు గ్వాలియర్ లో మొదటి టీ20 జరుగనుంది. ఈ క్రమంలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ తోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అడుగుపెడుతున్నాడు. ఇప్పుడు క్రికెట్ అభిమానుల అందరి దృష్టి అతని పైనే ఉంది. మయాంక్‌తో పాటు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ బంగ్లాదేశ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి, ఆమె రాజీనామా చేసి ఇండియాకు పారిపోయి వచ్చినప్పటి నుంచి ఆ దేశంలో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయి.
భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ గ్వాలియర్‌లో జరుగనుంది. MPCA స్టేడియంలో ఎల్లుండి (6 అక్టోబర్ 2024) మ్యాచ్ జరుగనుంది. అందులో భాగంగా ఇరు జట్లు తొలి టీ20 కోసం గ్వాలియర్ చేరుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా నెట్ సెషన్లో విపరీతంగా చెమటలు పట్టిస్తుంది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. మొదటిది గ్వాలియర్, రెండో టీ 20 న్యూ ఢిల్లీ, మూడో టీ20 హైదరాబాద్‌లో జరుగనుంది. చాలా రోజుల తర్వాత.. ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో జరుగనున్న టీ20 మ్యాచ్ కోసం టిక్కెట్ల విక్రయం జరుగనుంది.
Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మనెమ్మదిగా పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. ఇండియాతో సంబంధాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడైతే షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిందో అప్పటి నుంచి బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇస్లామిక్ మతోన్మాదులు చెలరేగిపోతున్నారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
బంగ్లాదేశ్‌కు మహ్మద్ యూనస్ నాయకత్వం వహించినప్పటి నుంచి పలు మార్లు హిందువులను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. ఇటీవల వరదలకు భారత్ కారణమని నిందించినట్లు సమాచారం.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. క్రీజులో షాద్ మాన్ ఇస్లాం (7), మోమినుల్ హక్ ఉన్నారు. కాగా.. రెండు వికెట్లను స్పిన్ మాయజాలం అశ్విన్ పడగొట్టాడు. బంగ్లాదేశ్ ప్రస్తుతం 26 పరుగుల వెనుకంజలో ఉంది. కాగా.. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉంది.
India vs Bangladesh Ravindra Jadeja: టీమిండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మధ్య రెండో టెస్టు కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. నాలుగో రోజు మ్యాచ్‌లో రవీంద్ర జడేజా టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. టెస్టు క్రికెట్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 7వ బౌలర్‌గా నిలిచాడు. టెస్టుల్లో భారత్ తరఫున…
బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది.