Bangladesh: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల గొడవలు హింసాత్మకంగా మారి, చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చేలా చేశాయి. హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ మతోన్మాదులు హిందువులను టార్గెట్ చేసి దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. హిందూ వ్యాపారాలను, ఆలయాలను తగలబెట్టారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఆ దేశంలో హిందువుల పరిస్థితి చక్కబడుతోంది.
ఇదిలా ఉంటే, తాజాగా రాహుల్ గాంధీ కలిసిన వ్యక్తుల్లో డొనాల్డ్ లూ అనే అమెరికన్ దౌత్యవేత్త కూడా ఉన్నాడు. ఇతను అమెరికా ప్రభుత్వం తరుపున సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియా వ్యవహరాల అసిస్టెంట్ కార్యదర్శిగా ఉన్నాడు. అయితే, ఇతడిని కలిస్తే సమస్య ఏంటని చాలా మంది అనుకోవచ్చు కానీ, ఇతను వెళ్లిన ప్రతీచోట ప్రభుత్వాలు దిగిపోవడం, తిరుగుబాటు రావడం జరిగింది.
IND vs BAN Test Series Bangladesh Team: సెప్టెంబర్ 19 నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్ కింద ఆడబోయే ఈ సిరీస్ కోసం 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ విజయంలో పాల్గొన్న ఆటగాళ్లే ఉండడం గమనార్హం. ఈ జట్టుకు నజ్ముల్ హుస్సేన్…
మణిపూర్ హింసలో ఉపయోగించిన బాంబులు, తుపాకుల స్థానంలో ఇప్పుడు రాకెట్లు, డ్రోన్లు వచ్చాయి. రెండు నెలల తాత్కాలిక శాంతి తర్వాత అకస్మాత్తుగా ఈ దాడులు మొదలయ్యాయి.
ఇదిలా ఉంటే, బెంగాలీలు అత్యంత పవిత్రంగా భావించే దుర్గాపూజ సమయంలోనే భారత్‌కి బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి పశ్చిమ బెంగాల్‌కి ఎగుమతి అయ్యే ‘‘పద్మ హిల్సా’’ చేపలపై నిషేధం విధించింది. ప్రతీ ఏడాది దుర్గాపూజ సమయంలో హిల్సా చేపలతో విందు చేసుకోవడాన్ని పశ్చిమ బెంగాల్లో సంప్రదాయంగా భావిస్తుంటారు.
Bangladesh: ఉగ్రవాదం, ర్యాడికల్ ఇస్లామిక్ నేతలుగా పేరొందిన వారిని ఉగ్రవాదులుగా గుర్తిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం వారందరిని అరెస్ట్ చేసింది. వారి సంస్థలపై నిషేధం విధించింది. అయితే, హసీనా గద్దె దిగడంతో ప్రస్తుతం ఆ దేశం తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇదిలా ఉంటే, ఆయన అధికారం చేపట్టిన తర్వాత జైళ్లలో ఉన్న పలువురు ఉగ్రవాద నేతలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రానురాను ఆ దేశంలో మతోన్మాదం, ఉగ్రవాదం పెరుగుతోంది.
బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 21 నెలల తర్వాత రిషబ్ పంత్ మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చాడు. కేఎల్ రాహుల్‌కు కూడా స్థానం లభించింది. అలాగే యంగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో చోటు దక్కింది. శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెట్టారు. మరోవైపు.. బౌలర్ యశ్ దయాళ్ను కూడా అదృష్టం వరించింది.
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా ఉద్యమం షేక్ హసీనా ప్రధాని పదవికి ఎసరు తెచ్చింది. రిజర్వేషన్ కోటా హింసాత్మకంగా మారడంతో, ఆ దేశ ఆర్మీ అల్టిమేటం ఇవ్వడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి రావాల్సి వచ్చింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాని గద్దె దించాలనే కుట్ర జరిగినట్లు వస్తున్న ఊహాగానాలకు బలం చేకూర్చిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. షేక్ హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్‌ని బంగ్లాదేశ్ నుంచి తొలగించే ప్లాన్ విదేశాల నుంచి అమలు చేయబడినట్లు తెలుస్తోంది. హసీనా పదవి నుంచి దిగిపోవడం వెనక అమెరికా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీనికి పాకిస్తాన్ కూడా తోడైంది.