భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ పూర్తవ్వగా.. టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 297 భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ.. సంజు శాంసన్ టీమ్ ఇండియాకు శుభారంభం అందించాడు. శాంసన్ సెంచరీ 40 కేవలం బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 13.4 ఓవర్ వద్ద ముస్తాఫిజుర్ బాలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మొత్తం 47 బంతుల్లో 111 రన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా.. అంతర్జాతీయ టీ20ల్లో సంజుకు ఇది తొలి సెంచరీ.
READ MORE: Crocodile: కాన్పూర్‌లో మొసలి హల్‌చల్.. భయాందోళనకు గురైన ప్రజలు
ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ టీ20లో భారత్‌ది రెండో అత్యధిక స్కోర్. మొదటి స్థానంలో నేపాల్ ఉంది. 2023లో మంగోలియాపై 314 పరుగులు సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు క్రికెట్‌లోని టీ20 ఫార్మాట్‌లో రెండో అత్యధిక స్కోరు టీమ్ ఇండియా పేరు మీదుగా మారింది. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ముందు.. 2019లో టర్కీతో జరిగిన మ్యాచ్‌లో 278 పరుగుల భారీ స్కోరు సాధించిన చెక్ రిపబ్లిక్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండేది. 2019లో ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ 278 పరుగుల రికార్డును కూడా కలిగి ఉంది.
READ MORE:Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రిని చంపేస్తామని బెదిరింపులు..
T20లో అత్యధిక స్కోర్ సాధించిన జట్లు..
314 పరుగులు – నేపాల్ (వర్సెస్ మంగోలియా)
297 పరుగులు – భారత్ (వర్సెస్ బంగ్లాదేశ్)
278 పరుగులు – చెక్ రిపబ్లిక్ (వర్సెస్ టర్కియే)