Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మనెమ్మదిగా పాకిస్తాన్‌కి దగ్గర అవుతోంది. ఏ దేశం నుంచి తమకు స్వాతంత్య్రం కావాలని పోరాడింతో, ప్రస్తుతం షేక్ హసీనా దిగిపోయిన తర్వాత ఆ దేశానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా షేక్ హసీనాను గద్దె దించడంతో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత, ప్రస్తుతం బంగ్లా తాత్కాలిక ఐటీ మంత్రిగా ఉన్న నహిద్ ఇస్లాం పాకిస్తాన్ రాయబార అధికారులతో భేటీ అవుతున్నాడు.
Bangladesh: రిజర్వేషన్ కోటాని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ ఉన్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత లౌకిక దేశంగా ఉన్న బంగ్లా నెమ్మదిగా ఇస్లామిక్ రాడికల్ పాలన దిశగా వెళ్తోంది. ఇందుకు అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు ఈ ఆరోపణల్ని బలపరుస్తున్నాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా రద్దుని కోరుతూ చేసిన నిరసనలు హింసాత్మకంగా మారి, చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియాకు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె గద్దె దిగిన తర్వాత బంగ్లా వ్యాప్తంగా హిందువులపై మతోన్మాద మూకలు దాడులకు తెగబడ్డాయి.
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ స్పందించారు. బంగ్లాదేశ్ ఆమెను అప్పగించాలని ఇండియాను కోరే వరకు ఆమె మౌనంగా ఉండాలని కోరారు. ఇది బంగ్లాకు, భారత్‌కి మంచిదని చెప్పారు. భారత్‌తో బంగ్లా బలమైన సంబంధాలకు విలువనిస్తుండగా, ‘‘ అవామీ లీగ్ మినహా ఇతర రాజకీయ పార్టీలను ఇస్లామిక్‌గా చిత్రీకరించి, షేక్ హసీనా లేకుండా బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్‌గా మారుతుందనే కథనాన్ని విడిచి న్యూఢిల్లీ…
రోహిత్ శర్మ సారథ్యంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. స్వదేశంలో పాకిస్థాన్‌ను వరుసగా రెండు టెస్టుల్లో ఓడించి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో సారథ్యంలోని బంగ్లాదేశ్ జట్టులో నైతిక స్థైర్యం ప్రస్తుతం ఎక్కువగా ఉంది.
పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ చిరస్మరణీయ టెస్టు సిరీస్ విజయం అందుకుంది. పాక్‌ను దాని సొంత గడ్డపై చిత్తు చేసిన బంగ్లా.. 2-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. జింబాబ్వే, వెస్టిండీస్‌పైనే కాకుండా పాకిస్థాన్‌పైనా టెస్టు సిరీస్ గెలిచిన బంగ్లా.. తాము పసికూన కాదని మరోసారి నిరూపించుకుంది. ఒకవైపు బంగ్లాదేశ్‌లో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ.. బంగ్లా క్రికెట్ టీమ్ అపూర్వ విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం బంగ్లాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ టెస్ట్ సిరీస్‌లో 10 వికెట్లు తీసిన…
Pakistan Cricket Worst Record on Home Soil: బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. పాక్‌పై రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లా జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌కు ముందు పాక్‌పై టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని బంగ్లా ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్‌ను దాని సొంతగడ్డపై 2-0తో చిత్తు చేసింది. తొలిసారి పాక్‌లో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఘోర ఓటమి పాలైన పాకిస్తాన్ జట్టుపై…
PAK vs BAN: రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ జట్టును ఓడించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం ఇదే తొలిసారి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) లో బంగ్లాదేశ్‌కు ఇది 3వ విజయం కాగా.., ప్రస్తుత వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ రౌండప్ లో పాకిస్థాన్‌కి 5వ ఓటమి. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన…
Bangladesh: బంగ్లాదేశ్ క్రమక్రమంగా రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందని షేక్ హసీనా నిషేధించిన ‘‘జమాతే ఇస్లామీ’’ సంస్థకు ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ క్లీన్చిట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన హెఫాజత్-ఏ ఇస్లాం సంస్థ నాయకుడు మమునుల్ హక్, అతడి గ్రూపు సభ్యులతో కలిసి మహ్మద్ యూనస్ భేటీ కావడం వివాదాస్పదమైంది.