Bangladesh: షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ ఈ మతఛాందసవాద శక్తుల్ని కంట్రోల్ చేయకపోవడమే కాకుండా, వారితో స్నేహం చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు వారికి బలంగా మారింది. షేక్ హసీనా సమయంలో నిషేధాన్ని ఎదుర్కొన్న సంస్థలు కూడా బహిరంగంగా రోడ్లపైకి వచ్చి, ర్యాలీలు తీస్తున్నాయి.
Bangladesh: వివాదాస్పద బంగ్లాదేశ్ విద్యార్థి నేత, గతేడాది ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ఎగిసిపడేందుకు కారణమైన విద్యార్థి నేత నహిద్ ఇస్లాం కొత్త రాజకీయ పార్టీని శుక్రవారం ప్రారంభించాడు. ఇతనే షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడంలో, హసీనా వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడు.
Bangladesh: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సర్కార్ నెమ్మదిగా ఆ దేశ చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన, ఆ దేశ జాతిపితగా కీర్తించబడే షేక్ ముజిబుర్ రెహ్మన్‌కి సంబంధించిన చరిత్రను పాఠశాల పుస్తకాల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి అయిన ముజిబుర్ రెహ్మాన్ పాత్రను స్వాతంత్య్ర పోరాటం నుంచి తగ్గిస్తోంది. దీనికి తోడు 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి కారణమైన, బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ సహకారాన్ని కూడా…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో టోర్నీలో 9వ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. నిరంతర వర్షం, తడి అవుట్ ఫీల్డ్ కారణంగా టాస్ కూడా పడలేదు. టాస్ పడకముందు నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికీ ఎడతెరిపి ఇవ్వకపోవడంతో అంఫైర్లు మ్యాచ్ రద్దు చేశారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ వ్యాఖ్యలు చూస్తే, రాబోయే కొన్ని రోజుల్లో మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్ర అసహనంతో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
Bangladesh : బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత, షేక్ హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందారు. మహ్మద్ యూనస్ ప్రస్తుతం దేశ ప్రధానమంత్రి, కానీ అతడు త్వరలోనే ఆ పదవికి దూరం కాబోతున్నాడా ఏంటన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Bangladesh: బంగ్లాదేశ్ కాక్స్ బజార్ జిల్లాలోని వైమానిక స్థావరంపై సోమవారం కొంత మంది నేరస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు బంగ్లాదేశ్ సైన్యం ధ్రువీకరించింది. సోర్సెస్ ప్రకారం.. బాధితుడిని 30 ఏళ్ల స్థానిక వ్యాపారి షిహాబ్ కబీర్‌గా గుర్తించారు. ఇతడిని కాల్చి చంపినట్లు సమాచారం. Read Also: Maharashtra: ‘‘మహాయుతి’’లో చీలిక.. ఫడ్నవీస్, షిండేల మధ్య మరింత దూరం..? బంగ్లాదేశ్ సాయుధ దళాల ప్రజా సంబంధాల విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR)…
Bangladesh : రంజాన్ కు ముందు బంగ్లాదేశ్ లోని యూనుస్ ప్రభుత్వం పాకిస్తాన్ తో ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ 50వేల టన్నలు బియ్యాన్ని బంగ్లాదేశ్ కు విక్రయించింది.
Bangladesh: టెక్ బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ని బంగ్లాదేశ్ ఆహ్వానించింది. డొనాల్డ్ ట్రంప్ ప్రధాన సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ తమ దేశాన్ని సందర్శించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ మేరకు యూనస్, మస్క్‌కి లేక రాసినట్లు తెలుస్తోంది.
Bangladesh: 1971లో విడిపోయిన తర్వాత తొలిసారి బంగ్లాదేశ్, పాకిస్తాన్ తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలను పున:ప్రారంభించాయి. ప్రభుత్వ ఆమోదం తర్వాత మొదటి కార్గో పోర్ట్ ఖాసిం నుంచి బయలుదేరినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఫిబ్రవరి ప్రారంభంలో బంగ్లాదేశ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్ (TCP) ద్వారా 50,000 టన్నుల పాకిస్తానీ బియ్యాన్ని కొనుగోలు చేయడానికి అంగీకరించడంతో ఒప్పందం కుదిరింది.