Himanta Biswa Sarma: బంగ్లాదేశ్‌కి అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంగా భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. ఇదిలా ఉంటే, మన దేశంలోని ఇతర రాష్ట్రాలతో, ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానించే ‘‘సిలిగురి కారిడార్(చికెన్ నెక్)’’కి సమీపంలో బంగ్లాదేశ్ లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరాన్ని పునరుద్ధరిస్తోంది. ఇది భారత్‌కి 100 కి.మీ దూరంలో ఉంది. దీని పునర్నిర్మాణంలో చైనా సహకరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో హిమంత వ్యాఖ్యలు రావడం గమనార్హం. భారతదేశానికి ఒక చికెన్ నెక్ ఉంటే, బంగ్లాదేశ్‌కి రెండు చికెన్ నెక్స్ ఉన్నట్లు హెచ్చరించారు. ‘‘మాకు ఒక చికెన్ నెక్ ఉంది. బంగ్లాదేశ్‌కి రెండు చికెన్ నెక్‌లు ఉన్నాయి. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ ఓడరేవును అనుసంధానించే ప్రాంతం భారత చికెన్ నెక్ కన్నా సన్నగా ఉంటుంది. ఒక్క రాయి విసిరే దూరంలో ఉంది. ’’ అని ఆయన అన్నారు.
Read Also: Vishwambhara : కేన్స్ లో ‘విశ్వంభర’ బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే..?
హిమంత బిశ్వ సర్మ బంగ్లాదేశ్‌కి భారత సైనిక బలాన్ని గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ పాకిస్తాన్ లోపల ఉన్న 11 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. భారత్ పై దాడి చేసే ముందు బంగ్లాదేశ్ 14 పునర్జర్మలు ఎత్తాలి’’ అని అన్నారు. కీలకమైన చికెన్స్ నెక్ కారిడార్ నుండి కేవలం 100 కి.మీ దూరంలో ఉన్న లాల్మోనిర్హాట్ వద్ద రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి వైమానిక స్థావరాన్ని పునరుద్ధరించడంలో చైనా బంగ్లాదేశ్‌కు సహాయం చేస్తోందని వచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది.
బంగ్లాదేశ్ చికెన్ నెక్స్ ఇవే:
బంగ్లాదేశ్ ప్రధాన భూభాగం నుంచి చిట్టగాంగ్ ప్రాంతం వేరు పడినట్లుగా ఉంటుంది. ఇది బంగ్లాదేశ్ మొత్తం భూభాగంలో 20 శాతం ఉంటుంది. త్రిపురకు సమీపంలో ఉన్న సన్నని కారిడార్ బంగ్లాదేశ్ ప్రధాన ఓడరేవు చిట్టగాంగ్‌ని మిగతా దేశంతో అనుసంధానిస్తుంది. ఇది మొదటి చికెన్ నెక్. ఇది మేఘాలయలోని నైరుతి గారో హిల్స్ నుంచి పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ దినాజ్ పూర్ వరకు 90 కి.మీ ఉంటుంది.
రెండోది, ఈశాన్య రాష్ట్రం మేఘాలయకు సమీపంలో ఉంది. బంగ్లాదేశ్ రంగ్‌పూర్ డివిజన్ సన్నగా ఉంటుంది. దీనిని మరో చికెన్ నెక్‌గా భావిస్తారు. ప్రస్తుతం చైనా పునర్నిర్మిస్తున్న లాల్మోనిర్హాట్ వైమానిక స్థావరం ఈ డివిజన్ లోకే వస్తుంది.