Bangladesh: భారత్‌కి వ్యతిరేకంగా యూనస్ మరో కుట్ర.. రహస్యంగా చైనా అధికారుల పర్యటన..
- భారత్‌కి వ్యతిరేకంగా మహ్మద్ యూనస్ మరో కుట్ర..
- సిలిగురి కారిడార్‌కి సమీపంలో బంగ్లా ఎయిర్ బేస్..
- దీనిని రహస్యంగా సందర్శించిన చైనా అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: భారత్ అంటేనే ద్వేషంతో రగిలిపోతున్నాడు బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్ యూనస్. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇతను భారత్ వ్యతరేక ప్రచారాన్ని బంగ్లాదేశ్‌లో ముమ్మరం చేశాడు. భారత్ అంటే పడని జమాతే ఇస్లామీ, బీఎన్పీ పార్టీ నేతల్ని తన సలహాదారుగా ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత, భారత ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నాడు. 1970లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాలను మరిచిపోయి స్నేహ హస్తం అందిస్తు్న్నాడు.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ భారత్‌కి వ్యతిరేకంగా కొత్త కుట్రకు తెర తీసింది. భారత వ్యూహాత్మక ప్రాంతమైన ‘‘సిలిగురి కారిడార్(చికెన్ నెక్)’’ కి సమీపంలో బంగ్లాదేశ్ భూభాగంలో లాల్మొనిర్హాట్ ప్రాంతంలో ఒక వైమానిక స్థావరాన్ని చైనాకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇది చైనా చేతిలో ఉంటే, భారత్‌కి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎందుకంటే, ఈ సిలిగురి కారిడార్ భారత్ మిగతా ప్రాంతాలతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే ఇరుకైన మార్గం కేవలం 20 కి.మీ వెడల్పు ఉండే ఈ ప్రాంతాన్ని కట్ చేస్తే, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధాలు నిలిచిపోయే అవకాశం ఉంది.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Read Also: Hyderabad: హైదరాబాద్‌లో పేలుళ్లకు ప్లాన్.. ఐసీస్ ఆపరేషన్‌ని భగ్నం చేసిన పోలీసులు
తాజాగా, చైనా అధికారులు రహస్యంగా బంగ్లాదేశ్‌లో పర్యటించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఈ లాల్మొనిర్హాట్ ఎయిర్ బేస్‌ని చైనా అధికార బృందం సందర్శించినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా భారత సరిహద్దు ప్రాంతంలోని చికెన్ నెక్ కారిడార్ సమీపంలో ఇతర ప్రాంతాలను కూడా సందర్శించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఈ వైమానిక స్థావరాన్ని పునరుద్ధరించడానికి, భారత సరిహద్దు నుండి కేవలం 20 కి.మీ దూరంలో ఉన్న రంగ్‌పూర్ డివిజన్‌లో ఉన్న ప్రదేశంలో విమానాశ్రయాన్ని నిర్మించడానికి బంగ్లాదేశ్ చైనా నుండి సహాయం కోరుతున్నట్లు సమాచారం.
భారత నిఘా ఏజెన్సీలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఈ స్థలాన్ని ప్రభుత్వ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తున్నారా..? లేదా ఫైటర్ పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి, ఫైటర్ జెట్స్ ఉంచేలా ఎయిర్ బేస్ అభివృద్ధి చేస్తున్నారా అనే దాని గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ స్థావరాన్ని భారత్‌కి వ్యతిరేకంగా చైనా, పాకిస్తా్న్ ఉపయోగించేందుకు బంగ్లాదేశ్ అనుమతిస్తుందా..? అనే దానిని పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ అధికారులు కూడా చికెన్ నెక్ సమీపంలోని రంగ్‌పూర్ డివిజన్‌ని సందర్శించారు.
తాజావార్తలు
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!