Bangladesh : ఇస్లాంలో రంజాన్ మాసం చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. ఈ నెలలో దెయ్యం కూడా జైలు పాలవుతుందని అంటున్నారు. మరోవైపు, బంగ్లాదేశ్‌లో ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే రంజాన్ ముందు దెయ్యాల వేట ఆపరేషన్ ప్రారంభించబడింది.
Bangladesh : షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి గద్దె దిగిన తర్వాత, బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వం ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టింది. ఏ మాత్రం అనుమానం ఉన్నా ఆ ప్రజలను అదుపులోకి తీసుకుంటున్నారు.
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆ దేశంలో అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిందో, అప్పటి నుంచి ఆ దేశంలో ఇస్లామిక్ రాడికల్స్ చెలరేగిపోతున్నారు. యూనస్ ప్రభుత్వం జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల్ని, అరాచకవాదుల్ని విడుదల చేసింది.
India-Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ అతి చేస్తోంది. ముఖ్యంగా తన స్థాయి ఏమిటో మరిచిపోయి భారత్‌కి వార్నింగ్ ఇస్తోంది. అక్కడి జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీమ్ వంటి మతోన్మాద, తీవ్రవాద సంస్థలు భారత దేశాన్ని బెదిరించేలా ప్రకటనలు చేస్తున్నాయి.
Bangladesh: మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌కి వరస షాక్‌లు తగులుతున్నాయి. షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోయిన తర్వాత మతోన్మాదంతో రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ఆర్థికంగా దివాళా తీసే స్థితికి చేరుకోబోతోంది. పాకిస్తాన్‌తో విస్తృత సంబంధాలు పెట్టుకోవాలని చూస్తు్న్న బంగ్లాదేశ్, పాక్ తీరులోనే అడుక్కునే స్థితిలోకి చేరే అవకాశం ఉంది.
Bangladesh: అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుమారుడు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్(ఓఎస్ఎఫ్) ఛైర్పర్సన్ అలెక్స్ సోరోస్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్‌కి ఆర్థిక సాయాన్ని ఆపేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. గత అక్టోబర్ నెలలో సోరోస్, యూనస్ కలిశారు. తాజాగా వీరిద్దరు రెండోసారి కలుసుకున్నారు.
Bangladesh : క్రీడలతో సహా ప్రతి రంగంలో మహిళలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రపంచవ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఆటలోనూ వారిని ముందుకు తెస్తున్నారు.
Bangladesh: నానాటికి బంగ్లాదేశ్ వ్యాప్తంగా మతోన్మాదం, ఉగ్రవాద భావాలు పెరుగుతున్నాయి. ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిందో, అప్పటి నుంచి మహ్మద్ యూనస్ ప్రభుత్వం, పాకిస్తాన్‌తో చెలిమి చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పాకిస్తాన్ నుంచి సైనిక సాయాన్ని కోరుతోంది.
Bangladesh: గత అమెరికా పాలకుల అండదండలతో విర్రివీసిన బంగ్లాదేశ్, దాని తాత్కాలిక ప్రభుత్వం అధినేత మహ్మద్ యూనస్‌కి యూఎస్ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. 90 రోజుల పాటు అన్ని విదేశీ సాయాలను నిలిపేయాలని ఆదేశించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) శనివారం తన నిధులను నిలిపివేసింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కోసం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతేడాది జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు.