గతేడాది ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రధాని పదవిని వీడిన ఆమె భారత్‌లో తలదాచుకునేందుకు వచ్చారు. ప్రస్తుతం మన దేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. అయితే.. హసీనా ప్రభుత్వ పతనం అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో మరోసారి తిరుగుబాటు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై స్పందించిన బంగ్లా సైన్యం ఇప్పటికే తీవ్రంగా…
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టు 05న ప్రజల చేత ఎన్నికైన షేక్ హసీనా పదవీచ్యుతురాలైంది. ఆ తర్వాత ఆమె ఇండియాకు పారిపోయి వచ్చింది. ఆ తర్వాత బంగ్లా చీఫ్‌గా యూనస్ పదవీ చేపట్టారు.
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ మైదానంలోనే కుప్పకూలాడు. సోమవారం సావర్‌లో జరిగిన ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025లో ఆడుతున్న 36 ఏళ్ల ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యాడు. సహచర ప్లేయర్స్, సిబ్బంది హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇక్బాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్బాల్ గుండెపోటు వచ్చినట్లు బీసీబీ చీఫ్ ఫిజీషియన్ దేబాషిష్ చౌదరి ధృవీకరించారు. డీపీఎల్ 2025లో మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు తమీమ్ ఇక్బాల్ నాయకత్వం వహిస్తున్నాడు. షైన్పుకుర్ క్రికెట్ క్లబ్‌తో…
Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాజధాని ఢాకాలో విస్తృతంగా సైన్యం మోహరించింది. ఇది తిరుగుబాటు ఊహాగానాలను లేవనెత్తుతోంది. ఢాకాలో ఎప్పుడూ లేని విధంగా సైన్యం మోహరించడం చూస్తే ఏదో జరగబోతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లా సైన్యం, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్, పారామిలిటరీ బలగాలు మోహరించబడ్డాయి.…
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న పదవీచ్యుతురాలైంది. హింసాత్మక ఘటనలతో ఆమె భారత్ పారిపోయి వచ్చింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, ఆమె పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలు, నేతలపై దాడులు జరిగాయి. అయితే, అవామీ లీగ్ పార్టీని రద్దు చేస్తారని, పార్టీని నిషేధించాలని యూనస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని వార్తలు వచ్చాయి.
గత కొంతకాలంగా బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిందూ మైనారిటీలను ముస్లిం మెజారిటీ జనాభా లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్ దేశంలో శాంతి భద్రతలు గాడిలో ఉన్నాయని చెబుతున్నప్పటికీ, అక్కడ హిందువులపై దాడులు ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి హిందూ దేవాలయంపై దాడి జరిగింది. లక్ష్మీపూర్ జిల్లాలోని రాయ్‌పూర్‌లోని మురిహట ప్రాంతంలోని శ్రీ శ్రీ మహామాయ ఆలయంలో ముసుగులు…
బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే మేటి ఒకడిగా పేరు తెచ్చుకున్న వెటరన్ క్రికెటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల మహ్మదుల్లా సోషల్ మీడియా వేదికగా తాను రిటైరవుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. దాంతో బంగ్లాదేశ్ క్రికెట్ స్వర్ణ తరం ఐదుగురు పాండవులు ఆటకు దూరమయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బంగ్లాదేశ్ ఘోర పరాజయం పాలైన తర్వాత ముష్ఫికర్ రహీమ్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. మష్రఫే మోర్తాజా, తమీమ్ ఇక్బాల్ ఇప్పటికే…
Pak train hijack: పాకిస్తాన్‌కి బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) చుక్కలు చూపిస్తోంది. బలూచిస్తాన్ క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ని హైజాక్ చేశారు. ట్రైన్లో మొత్తం 400+ ప్రయాణికులు ఉంటే, 200 మందిని బీఎల్ఏ బందీలుగా చేసుకుంది.
Pak train hijack: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో రైలు హైజాక్ జరిగిన ఘటన యావత్ ప్రపంచంలో సంచలనంగా మారింది. బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్న ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ఫైటర్స్ ఈ హైజాక్‌కి పాల్పడ్డారు. మంగళవారం బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కి వెళ్తున్న ‘‘జఫర్ ఎక్స్‌ప్రెస్’’ని మారుమూల సిబి జిల్లాలో బీఎల్ఏ అదుపులోకి తీసుకుంది. ట్రైన్ ట్రాక్‌ని పేల్చేసిన బీఎల్ఏ 400 మంది ప్రయాణికులను బందీలుగా చేసుకుంది. ఇందులో పెద్ద సంఖ్యలో పాక్…
Balochistan: పాకిస్తాన్ జాతిపితగా పిలువబడే ‘‘మహ్మద్ అలీ జిన్నా’’ బలూచిస్తాన్‌కి చేసిన నమ్మక ద్రోహం కారణంగా ఆ ప్రాంతం కొన్ని దశాబ్ధాల కాలంగా రగులుతూనే ఉంది. పాక్ నుంచి విముక్తి, తమ వనరులపై హక్కుల కోసం బలూచ్ ప్రజలు అనేక సార్లు తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం సైన్యం సాయంతో, కుట్రల సాయంతో ఈ తిరుగుబాటుని అణచివేస్తూనే ఉంది. తాజాగా, బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాక్ రైల్వేకి చెందిన జఫర్ ఎక్స్‌ప్రెస్‌ని హైజాక్ చేయడం సంచలనంగా…