ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ రాజీనామా చేస్తానని తెలిపిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం తన పౌరులకు ఒక సలహా జారీ చేసింది. బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం, విదేశీయులను వివాహం చేసుకోవడానికి సంబంధిత చట్టాలను ఖచ్చితంగా పాటించాలని చైనా పౌరులకు సూచించింది.
Also Read:PBKS vs MI: ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. టాప్-2 టార్గెట్!
బంగ్లాదేశ్ పురుషుడు లేదా స్త్రీని వివాహం చేసుకోవడానికి ఆఫర్ చేసే అక్రమ వివాహ సంబంధాల ఏజెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, వీడియో ప్లాట్‌ఫామ్‌లలో క్రాస్-బోర్డర్ డేటింగ్ కంటెంట్ ద్వారా తప్పుదారి పట్టకండి. విదేశీ భార్యలను కొనకుండా ఉండాలని.. బంగ్లాదేశ్‌లో వివాహం చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని చైనా పౌరులను రాయబార కార్యాలయం హెచ్చరించింది.
Also Read:Vishnupriya : చీరకట్టులో నడుము అందాలు చూపిస్తున్న విష్ణుప్రియ
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య వివాదం ఉంది. బంగ్లాదేశ్‌లోని మయన్మార్ సరిహద్దులో మానవతా కారిడార్ నిర్మించే ప్రణాళికపై సైన్యం, ప్రభుత్వం ముఖాముఖి తలపడుతున్నాయి. బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దులో మానవతా కారిడార్ నిర్మించడానికి యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అమెరికాతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ దానిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read:Miss World Controversy: మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు.. విచారణకు కమిటీ ఏర్పాటు..
బంగ్లాదేశ్‌లో నిరసనలు నిరంతరం జరుగుతున్నాయి. విద్యార్థి సంఘాల నుంచి ప్రతిపక్ష పార్టీల వరకు అన్ని వైపుల నుంచి మహ్మద్ యూనస్ చుట్టుముట్టబడ్డాడు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ ఏడాది చివరిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. మహఫూజ్ ఆసిఫ్, ఖలీలుర్ రెహమాన్ వంటి నాయకులను ప్రభుత్వం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు నిరసనలు ప్రారంభించాయి.
The Chinese Embassy in #Bangladesh issued a reminder late Sunday that Chinese citizens should strictly follow the law concerning foreign-related marriage, avoid illegal matchmaking agents, and not be misled by cross-border dating content on short video platforms. They should… pic.twitter.com/FpWu9ScigF
— Global Times (@globaltimesnews) May 26, 2025