jeevitha rajasekhar:తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకు తగ్గట్లుగా కేంద్ర మంత్రులు, కీలక నేతలు తరుచుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజాసంగ్రామ యాత్ర’పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నారు. తాజాగా నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర కూడా పూర్తయింది. అయితే రానున్న రోజుల్లో మరింతగా బలపడాలని బీజేపీ భావిస్తోంది. దీని కోసం పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి…
మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నిక కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. కేసీఆర్ ఖేల్ కాబోతోందని...ఆయన దుకాణం బంద్ ఖాయమన్నారు. కేసీఆర్ తో లడాయికి సిద్ధమయ్యామని... ఎంఐఎతో కలిసి వచ్చినా బల ప్రదర్శనకు సిద్ధమని సవాల్ విసిరారు.
Sadhvi Niranjan Jyoti comments on TRS and CM KCR: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ పెద్ద అంబర్ పేటలో జరిగింది. కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి. ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారి ఇళ్లపైకి…