BL Verma Visit to Warangal: తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత గుండా రాజకీయాలు అంతం చేస్తామని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృధి శాఖ, సహకార శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ అన్నారు. వరంగల్ పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా మంత్రి బి.ఎల్. వర్మ హనుమకొండలో పర్యటించనున్నారు. సహకార శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ హనుమకొండ హరిత హోటల్ లో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని అన్నారు. మోడీ ప్రధాన మంత్రి అయిన తరువాత ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లక్షలాది పేదలకు ఇండ్ల నిర్మాణం చేశారు. కిసాన్ సమ్మన్ నిధి ద్వారా రైతయాలకు పెట్టుబడి సహాయం అందిస్తుందని అన్నారు.
Read also: Krishna Vrinda Viahari Review : కృష్ణ వ్రింద విహారి రివ్యూ
ఆయుష్మాన్ భారత్ ద్వారా మెరుగైన వైద్యం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని గుర్తు చేశారు. కరోనా సమయంలో మోదీ పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారన్నారు. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేసి కరోనా కట్టడికి విశేషమైన కృషి చేశారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం సాధించే దిశగా పని చేస్తున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గుండా కార్యకలాపాలను అంతం చేశారన్నారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత గుండా రాజకీయాలు అంతం చేస్తామని బి.ఎల్. వర్మ తెలిపారు.
Krishna Vrinda Viahari Review : కృష్ణ వ్రింద విహారి రివ్యూ