Etela Rajender: మెదక్ జిల్లాలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ నెల 9న నర్సాపూర్ లో జరగబోయే బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించారు. బహిరంగ సభకు కేంద్ర మంత్రులు భూపేంద్ర సింగ్ యాదవ్, కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరుకానున్నట్లు ఈటెల తెలిపారు. బహిరంగ సభలో బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని ఈటల వెల్లడించారు. అనంతరం ఈటెల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని ఎద్దేవ చేశారు. బీజేపీ నేతలు జిల్లాలో ఎక్కడ తిరిగినా వారి ఇన్ఫర్మేషన్ కేసీఆర్ తీసుకుంటున్నారని విమర్శించారు.
Read also: Vande Bharat Express: 24 గంటల్లోనే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు రిపేర్.. నిన్న ట్రైన్‌కు ప్రమాదం.
టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు, 100 మందికి ఒక షాపు పెట్టించిన ఘనత తెలంగాణ ప్రభుత్వనిదే అని ఈటెల విమర్శించారు. ఒక సంవత్సరానికి మద్యం షాప్ ల మీద 45 వేల కోట్లు వస్తున్నాయని ఆర్థిక మంత్రి తెలియజేయడం ఆశ్చర్యకరమని ఈటెల తీవ్రంగా మండిపడ్డారు. హుజురాబాద్ లో 400 కోట్లు రూపాయలు మద్యం కోసం ఖర్చుపెట్టిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు. మునుగోడు నియోజకవర్గానికి అంబులెన్స్ లలో, పోలీసుల వ్యాన్లలో కోట్ల డబ్బులు సరఫరా అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ కు ఉద్యమకారులకు బంధం తెగిపోయిందని ఈటెల రాజేందర్ అన్నారు.
Mushroom Food : మష్రూమ్స్ తింటే ఇన్ని లాభాలా.. అయితే మీరు కూడా తెలుసుకోవాల్సిందే..!