Bandi Sanjay 5th Phase praja Sangrama Yatra
ప్రజా సంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవలే ఆయన నాల్గవ విడత ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్ర ముగిసింది. అయితే.. తాజాగా ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 15 నుండి బండి సంజయ్ 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్రను భైంసా నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భైంసా నుంచి కరీంనగర్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
అంతేకాకుండా.. బాసర అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేసి భైంసా నుండి యాత్రను బండి సంజయ్ మొదలు పెట్టనున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి. అయితే.. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 48 అసెంబ్లీ నియోజక వర్గాల్లో, 1260 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు బండి సంజయ్. గత ఏడాది ఆగస్ట్ 28 న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ ప్రారంభించారు.