Bandi Sanjay : ఆర్ఎంపీ వ్యవస్థను ధ్వంసం చేయాలనుకోవడం దుర్మార్గం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలందిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలపట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. తాజాగా ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో.. ‘ఇంజక్షన్ వేయకూడదని, సెలైన్ ఎక్కించకూడదని, రిజిస్ట్రేషన్ లేదనే సాకుతో ప్రజలకు వైద్యం అందించకుండా ఏకంగా ఆ వ్యవస్థే లేకుండా ధ్వంసం చేయాలనుకోవడం దుర్మార్గం. ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఎన్నికల సమయంలో ఆర్ఎంపీలు, పీఎంపీలకు ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించారు. టీఆర్ఎస్ అధికారంలోకొస్తే ఆర్ఎంపీలు, పీఎంపీలకు ప్రత్యేక శిక్షణనిచ్చి గ్రామాల్లో ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కల్పిస్తామని ఆనాడు ఇచ్చిన హామీని గాలికొదిలేసి ఏకంగా ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థనే లేకుండా చేయాలనుకోవడం సిగ్గు చేటు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. డాక్టర్ల భర్తీ లేదు. మందుల్లేవు. పరీక్షలు చేసే నాథుడే లేడు. 104 సేవలను పూర్తిగా నిలిపేశారు. ఎమర్జెన్సీ సేవలందించే 108 అంబులెన్సులకు డీజిల్ కూడా పోయించలేని దుస్థితిలోకి నెట్టేశారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో, బస్తీల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో 24 గంటలు అందుబాటులో ఉంటూ అత్యంత తక్కువ ఖర్చుతో ప్రాథమిక వైద్య సేవలందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతోంది ఆర్ఎంపీ, పీఎంపీలే.
Also Read
- IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
- Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
ఆ వ్యవస్థనే లేకుండా చేస్తే ప్రజల ప్రాణాలను కాపాడేదెవరు? ఊరికో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందించగలరా? నియోజకవర్గానికో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తానని మాట తప్పిన సీఎం కేసీఆర్ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయారు. ఆర్ఎంపీ, పీఎంపీల్లో ఎవరైనా తప్పు చేస్తే శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అంతే తప్ప మొత్తం ఆర్ఎంపీ వ్యవస్థనే లేకుండా చేయాలనుకోవడం దుర్మార్గపు చర్య. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ఎంపీల విషయంలో జోక్యం చేసుకోవాలి. చిన్నపాటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా సరిగా చేయలేక ఇబ్రహీంపట్నంలో 4గురు మహిళల మ్రుతి చెందితే కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్… అందుకు బాధ్యులైన వైద్యశాఖ డైరెక్టర్, వైద్యశాఖ మంత్రిపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటు. సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే వైద్యశాఖ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలి. వైద్యశాఖ మంత్రిని బర్త్ రఫ్ చేయాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.’ అని బండి సంజయ్ అన్నారు.
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!