తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న మునుగోడుకి ఎంతో చరిత్ర వుంది. 1967 వరకు చిన్న కొండూరు నియోజకవర్గంగా ఉన్న నియోజకవర్గం… 1967 తర్వాత నుండి మునుగోడు నియోజకవర్గంగా మారింది. గతంలో మునుగోడు నియోజకవర్గం 1967 వరకు చినకొండూరు నియోజకవర్గంగా ఉండేది.
Read Also: Prachand Helicopter: మేడ్ ఇన్ ఇండియా.. ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్
1952 మొదటి సాధారణ ఎన్నికల్లో పీడీఎఫ్ నుండి బివిఎన్ రావుపై కె.వెంకట్రామారావు గెలిచారు
1957 లో (కె.వెంకట్రామారావు పిడిఎఫ్ పై కాంగ్రెస్ నుండి కొండా లక్ష్మణ్ బాపూజీ గెలిచారు)
1962 లో కొండాలక్ష్మణ్ బాపూజీ కాంగ్రెస్ పై సిపిఐ నుండి కె.గురునాథరెడ్డి గెలిచారు
1965 లో ఉపఎన్నిక రాగా జె.ఎం.రెడ్డి సిపిఐపై కాంగ్రెస్ నుండి కొండాలక్ష్మణ్ బాపూజీ గెలిచారు
1967లో మునుగొడు నియోజకవర్గం ఏర్పడింది…
1967 లో కాంగ్రెస్ నుండి పాల్వాయి గోవర్థన్ రెడ్డి గెలుపు(ఉజ్జిని నారాయణరావు సీపీఐ పై)
1972 లో కాంగ్రెస్ నుండి పాల్వాయి గోవర్థన్ రెడ్డి గెలుపు(ఉజ్జిని నారాయణరావు సీపీఐ పై)
1978 లో కాంగ్రెస్ నుండి పాల్వాయి గోవర్థన్ రెడ్డి గెలుపు(కె.రామక్రుష్ణారెడ్డి జనతా పార్టీపై)
1983 లో లో కాంగ్రెస్.ఐ నుండి పాల్వాయి గోవర్థన్ రెడ్డి గెలుపు(ధర్మబిక్షం సీపిఐపై)
1985 లో సిపిఐ నుండి ఉజ్జిని నారాయణరావు గెలుపు(ఎం.నారాయణరావు కాంగ్రెస్ పై)
1989 లో సిపిఐ నుండి ఉజ్జిని నారాయణరావు గెలుపు(పాల్వాయి గోవర్థన్ రెడ్డి కాంగ్రెస్ పై)
1994 లో సిపిఐ నుండి ఉజ్జిని నారాయణరావు గెలుపు(పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఇండిపెండెంట్ పై)
1999 లో పాల్వాయి గొవర్దన్ రెడ్డి గెలుపు (టీడీపీ జల్లా మార్కండేయపై)
2004 లో సిపిఐ నుండి పల్లా వెంకట్ రెడ్డి గెలుపు(చిలువేరు కాశీనాథ్ టీడీపీ పై)
2009 లో సిపిఐ నుండి ఉజ్జిని యాదగిరి రావు గెలుపు(పాల్వాయి గోవర్థన్ రెడ్డి కాంగ్రెస్ పై)
2014 లో టీఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రబాకర్ రెడ్డి గెలుపు(పాల్వాయి స్రవంతి ఇండిపెండెంట్ పై)
2018 లో కాంగ్రెస్ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు(కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ పై)
Read Also: Prachand Helicopter: మేడ్ ఇన్ ఇండియా.. ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్