Kishan Reddy: ఇంద్ర కరణ్ రెడ్డి గెలిచింది ఎక్కడ? మంత్రి అయింది ఎక్కడ? బ్రోకరీజం చేసింది ఎవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారంలో స్పందించిన ఆయన నాంపల్లి పార్టీకార్యాలయంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. డబ్బు దొరికింది ఫార్మ్ హౌస్ నుండి వచ్చిందా? ప్రగతి భవన్ నుండి వచ్చిందా? మునుగోడు ఉప ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీఆర్‌ఎస్ పెద్ద కుట్ర చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.…
ఆ.. రెండు ఛానళ్లకు సంబంధించిన రిపోర్టర్లు 6గంటలకే వెళ్లి అక్కడ వున్నారు. పోలీస్ అధికారి ముందే వెళ్లి వచ్చారు. ముందే రికార్డు చేసి పెట్టుకున్నారు. స్వామిని కూడా వదిలిపెట్టరా? ఎందుకు ముఖ్యమంత్రికి హిందువులంటే అంత కోపం అంటూ ఆరోపించారు.
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు పలుమార్లు తనిఖీ నిర్వహించారు.