BJP Steeting Committee Meeting On Munugodu By Elections: ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఉద్దేశంతో.. బీజేపీ చాలా కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో జెండా పాతేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఓవైపు యాత్రలు, మరోవైపు మీటింగ్‌లతో.. జోరు చూపిస్తోంది. ఇప్పుడు 16 మంది స్టీరింగ్ మీటింగ్‌ని బీజేపీ నిర్వహించింది. ఇందులో భాగంగా ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో భాగంగా స్టీరింగ్ కమిటీ సభ్యులు తమతమ అభిప్రాయాలు వెల్లడించాక.. 6 మండలాలు, రెండు మునిసిపాలిటీలకు ఇంఛార్జిలను నియమించారు. ఒక్కో మండలానికి ఒక ఇంచార్జిని, ఇద్దరు సహ ఇంచార్జిలను నియమించడం జరిగింది.
ఈనెల 27తేదీన చౌటుప్పల్‌లో మండల ఇన్చార్జులు, సహ ఇంచార్జిలు సమావేశం కానున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి మొదలు దసరా వరకు మండలాల్లో ఇంచార్జిలు పర్యటించనున్నారు. వారి మకాం కూడా అక్కడే! ఇదే సమయంలో బూత్ కమిటీలపై సమీక్ష నిర్వహించి, బలోపేతం చేయాలని నిర్ణయించారు. సామాజిక వర్గాల వారీగా మీటింగ్‌లు పెట్టాలని డిసైడ్ అయ్యారు. మునుగోడు ఎన్నికల ఇంచార్జిగా వివేక్ వెంకట స్వామిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడులో గెలిస్తే రాష్ట్రంలో గెలిచినట్టేనన్న అభిప్రాయం ఉందని అన్నారు. మునుగోడు ఫైనల్ మ్యాచ్ కానుందని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలకు మండల ఇంచార్జిలను వేయడం జరిగిందని చెప్పిన ఆక్ష్న.. భారీ మెజారిటీతో గెలవాలసి బండి సంజయ్ పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వంపై చార్జ్‌షీట్, మేడిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిపారు.
ఆయా మండలాలకు నియామకమైన ఇంచార్జిలు:
చౌటుప్పల్ – కూన శ్రీశైలం గౌడ్
చౌటుప్పల్ మునిసిపల్ – రేవూరి ప్రకాశ్ రెడ్డి
నారాయణ్‌పూర్ – రఘునందన్ రావు
మునుగోడు – చాడ సురేష్ రెడ్డి
చండూరు – నందీశ్వర గౌడ్
చండూరు మునిసిపల్ – ధర్మారావు
నాంపల్లి – ఏనుగు రవీందర్ రెడ్డి
మర్రి గూడెం – కొండ విశ్వేశ్వర్ రెడ్డి