గోబెల్స్ ను మించిన వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ అని ఆరోపించారు. ముందు నీళ్ళు ఇవ్వమని చెప్పు అని, కేంద్ర ప్రభుత్వము ఉద్యోగాలు ఇస్తుందన్నారు. 10 లక్షలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుందన్నారు. నేను బూతులు మాట్లాడుతున్నానా….నాకు గురువు కేసీఆరే అని ఆయన అన్నారు. హరీష్ అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో ముందు చెప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నీళ్లు ఇస్తానన్నారని, మిషన్ భగీరథ కోసం 40వేల కోట్లు ఖర్చు పెట్టారు… ఇంటింటికి నీళ్లు ఇవ్వడం లేదన్నారు. నీళ్లు ఇవ్వకపోతే కేసీఆర్ ఓటు అడగనన్నారు.. ఇంటింటికి నీళ్లు ఇచ్చారా అని ఆయన అన్నారు.
Also Read : Judges Transfer : తెలంగాణలో భారీగా జడ్జీల బదీలు
జల జీవన్ మిషన్ కింద అన్ని రాష్ట్రాల్లోని ఇంటింటికి కేంద్రం నీళ్లు ఇచ్చిందన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఈ నెల 23న పార్లమెంట్ ప్రవాస్ యోజనలో పాల్గొనేందుకు అమిత్ షా చేవెళ్లకు రాబోతున్నారన్నారు. చేవెళ్ల పార్లమెంట్‌కు చెందిన నేతలతో అమిత్ షా సమావేశం అవుతారని, సాయంత్రం 5గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని బండి సంజయ్ తెలిపారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ బాన్సువాడలో రాజ్యాంగాన్ని పోచార శ్రీనివాస్ తూట్లు పొడుస్తున్నారన్నారు. కేసీఆర్ తరహాలోనే బాన్సువాడలోనూ కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. స్టేషనరీ స్కాంలో అడ్డంగా బుక్కై కేబినెట్ నుండి బర్తరఫ్ అయిన వ్యక్తికి రాజ్యాంగబద్ద పదవిస్తే ఇట్లనే ఉంటదన్నారు.
Also Read : Qudruplets: ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జననం