Bandi Sanjay: చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్ లో ఈ భేటీ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 23న తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. చేవెళ్లలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నియోజకవర్గ నేతలతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుల ఈటెల రాజేందర్ తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ సమవేశానికి హాజరయ్యారు.
Read Also: Karimnagar: అనుమానాస్పద మృతిని చేధించిన జమ్మికుంట పోలీసులు..
చేవెళ్లలో జరగబోయే అమిత్ షా సభకు ‘‘విజయ సంకల్ప సభ’’గా నామకరణం చేశారు. ఈ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నేతలకు సంజయ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ పంజాబ్ రైతులకు చెక్కులు ఇచ్చి చెల్లకుండా పోయారని ఎద్దేవా చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమకు కేంద్ర సహకరించకపోయినా, మేమే చేస్తామని కేసీఆర్ అన్నారు, ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. కుక్కలు కరిసినా, నాలాలో పిల్లవాడు పడి చనిపోయినా, మున్సిపల్ మంత్రి రాజీనామా చేయలేదని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశంలో కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే, తెలివిగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
ఎక్కువ తింటే ఏం జరుగుతుందో, ఎక్కువ డబ్బులు దోచుకుంటే అదే జరుగుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్లంతా హోల్ సేల్ గా బీఆర్ఎస్ వైపు వెళ్తారని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని జానారెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీ మాత్రమే ఎదుర్కొంటోందని అన్నారు. సమావేశానికి కార్యకర్తలను పట్టుకునిరాని వాళ్లు లీడర్లు కాదు అని చెప్పారు.