Minister Jagadish Reddy: 25 ఏళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క అవార్డు రాలేదని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కోటి మంది ఉద్యోగం ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు బీజేపీ ఎంతమందికి ఉపాధి కల్పించారో చెప్పాలని అడిగారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 32 వేల ఉద్యోగాలను ఇచ్చామని, అయినా తాము ఎవరికి చెప్పుకోలేదని అన్నారు.
Read Also: Neeraja Reddy: విషాదం.. రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి మృతి
బీజేపీ పరిపాలన చేస్తున్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చూపించండి అంటూ సవాల్ విసిరారు. బీజేపీ యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పేపర్ లీకేజీ అనేది వాస్తవానికి బీజేపీ కార్యకర్తలు చేసిన పని అనికూడా మనం అనుమాన పడలేదని, తెల్లారేసరికి అసలు దొంగ దొరికిండని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ఉద్దేశించి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి, బీజేపీ పార్టీ అధ్యక్షుడికి చదువు రాదు, చదువు విలువ తెలియదని, బండి సంజయ్ కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని విమర్శించారు.