Bandi sanjay: అకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోతుంటే సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రోడ్లపై తడిసిన ధాన్యం ఆరబోస్తున్న రైతుల వద్దకు బండి సంజయ్ వెళ్లి వారి బాధలు తెలుసుకున్నారు.
Off The Record: తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా…ఆ ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందని కాషాయ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఎన్నికలు జరిగిన చోట బీజేపీ గెలిస్తే ఇక్కడా చేరికలు ఉంటాయట. ఐతే…చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికలు జరిగాయి. పలితాలు వచ్చాయి. కానీ ఇక్కడ మాత్రం వారు ఊహించిన స్థాయిలో చేరికలు జరగనేలేదు. ఎక్కడైనా ఎన్నికలు జరిగి బీజేపీ గెలిస్తే ఆ ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్…
Raja Singh: తెలంగాణ బీజేపీ అధిష్టానం తీరుతో విసిగిపోయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుగుదేశంలో చేరే అవకాశాలు ఉన్నాయనే వార్తలు సంచలనంగా మారాయి. అయితే రాజా సింగ్ బీజేపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు ఇటీవల వస్తున్న వదంతులపై శనివారం ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు.
ప్రజల మదిలో నిలిచేలా ‘‘మన్ కీ బాత్’’ 100వ ఎపిసోడ్ ను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు కన్నీరుమున్నీరయ్యారు. చేతికి వచ్చిన పంట వర్షాలకు దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.