తమిళ యువ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో షారుక్ ఖాన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే! దాని పేరును శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దీనికి ‘జవాన్’ అనే పేరు ఖరారు చేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పై షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఎస్.ఆర్.కె. ప్రెజంటర్ గా ఉన్నారు. ఈ మూవీ టైటిల్ కు ను ప్రకటిస్తూ ఓ టీజర్ ను విడుదల…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ చిత్రాన్ని ముగించే పనిలో ఉన్న విషయం విదితమే.. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుఖ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, లీకైన దీపికా బికినీ ఫొటోస్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. గత కొన్నేళ్లుగా పరాజయాలను చవిచూస్తున్న షారుఖ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత షారుఖ్,…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాను కోలీవుడ్ స్టార్ విజయ్ కు అభిమానిని అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. “బీస్ట్” హిందీ ట్రైలర్‌ను ఆవిష్కరిస్తూ దళపతి విజయ్ అభిమానులను షారుఖ్ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ చిత్రం ఏప్రిల్ 13న పలు భాషల్లో గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉండగా, ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా షారుఖ్ “అట్లీతో కలిసి కూర్చున్నాను. విజయ్ కి అట్లీ ఎంత పెద్ద అభిమానో నేను కూడా…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఫోటోగ్రాఫర్ అవతారమెత్తారు. కోలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లను ఒకచోట చేర్చి, విజయ్ వారి పిక్ తీయడం విశేషం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో ముగ్గురు టాప్ దర్శకులు అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనగరాజ్ కలిసి పోజులివ్వడం కన్పిస్తోంది. ఈ పిక్ లో వారి పైన “వాట్ ఎ లైఫ్” అనే బోర్డు ఉంది. ఈ చిత్రం క్రెడిట్ అంతా విజయ్ కే దక్కుతుంది.…
“పుష్ప : ది రైజ్” విజయం తర్వాత అల్లు అర్జున్ దక్షిణాదిలోనే కాకుండా హిందీ ప్రేక్షకులలో కూడా మోస్ట్ వాంటెడ్ నటులలో ఒకరిగా మారారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి ఉంది. ఇంకేముంది ‘పుష్ప-2’… కానీ ఆ తరువాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. దర్శకుడు అట్లీతో ఒక చిత్రం కోసం అల్లు అర్జున్‌కు భారీ మొత్తంలో ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ‘పుష్ప’…
సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ నయనతార మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా తన అభిమానులను అలరించబోతోందట. ఇటీవల షూటింగ్ ప్రారంభించిన షారుఖ్ ఖాన్ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది నయన్. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా “లయన్” అనే టైటిల్ పెట్టారు. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లో నయనతార ఇన్వెస్టిగేటివ్ పోలీస్ పాత్రలో నటించనుందని టాక్. ఆ పాత్రకు నయనతారనే…
చార్ ధామ్ ఆధ్యాత్మిక యాత్ర ముగించుకుని వచ్చిన సమంత వృత్తిగత జీవితంలో ఫుల్ బిజీ అయింది. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లు సైన చేస్తున్న సమంత తాజాగా షారూఖ్, అట్లీ సినిమాలోనూ నటించబోతోందట. ఇందులో నయనతార స్థానంలో సమంతను ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాలో ముందు సమంతనే అనుకున్నాడు అట్లీ. అయితే అప్పట్లో సంసారజీవితంలో బిజీగా కావాలనుకున్న సమంత ఆ ఆఫర్ ని అంగీకరించలేదు. ఆ తర్వాత అట్లీ షారూఖ్ సరసన నయనతారను హీరోయిన్…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తరువాత మరో సినిమా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కెరీర్ పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు సామ్ ‘నో’ చెప్పింది అంటూ వార్తలు విన్పిస్తున్నాయి. Read Also : “అన్ స్టాపబుల్” టాక్ షోకు బాలయ్య రెమ్యూనరేషన్ తెలుసా ? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. “లయన్” అనే…
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నయనతార, ప్రియమణి ఈ సినిమాలో కథానాయికలు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో షారుఖ్ ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూణేలో చిత్రీకరించారు. అక్కడ నుంచి లీకైన ఫోటోలలో షారుఖ్ సరికొత్త మేక్ఓవర్ లో కన్పించారు. లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…
ఎప్పటినుంచో వినిపిస్తున్న షారూఖ్, అట్లీ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇటీవల ఈ సినిమా పూణేలో ప్రారంభమైంది. ప్రస్తుతం సినిమా ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు పని చేయబోతున్నారట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పాటలు కంపోజ్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయబోతున్నట్లు టాక్. ఇంతకు ముందు రెహమాన్, అట్లీ కలసి ‘మెర్సల్, బిగిల్’ సినిమాలకు పని చేశారు.…