టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు నిత్యం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అన్న విషయం తెలిసిందే. అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లాడిన సామ్.. నాలుగేళ్లకే విడాకులు తీసుకొని దూరమైంది. ఇక ఈ జంట విషయంలో అభిమానులు ఎంతో నిరాశకు గురయిన విషయం విదితమే..సందర్భం వచ్చినప్పుడల్లా చై- సామ్ ల మధ్య ఉన్న ప్రేమను బయటపెడుతూ ఉంటారు.. ఇక తాజాగా సామ్ తనకు వచ్చిన ఒక మంచి ఆఫర్ ను చై కోసం రిజెక్ట్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి అదేంటంటే.. చైతన్య కోసం బాలీవుడ్ బాద్షా షారుఖ్ సరసన నటించే అవకాశాన్ని వదులుకున్నదట.
ప్రస్తతం షారుఖ్ – అట్లీ కాంబోలో జవాన్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. మొదట ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే అట్లీ షారుఖ్ సరసన సమంతను అనుకున్నాడట.. 2019లోనే స్క్రిప్ట్ తో సమంతను సంప్రదించడం, ఆమె కాదనడం జరిగాయని తెలుస్తోంది. సమంత తన ఫ్యామిలీ లైఫ్ కోసం సమయం కేటాయించాలని అనుకున్నారని, నాగ చైతన్యతో కలిసి కుటుంబ జీవనాన్ని కోరుకున్నారని.. ఆ క్రమంలోనే పెద్ద ఆఫర్ లను కాదనుకున్నారని ఒక ఆంగ్ల పత్రిక అప్పట్లోనే ప్రచురించింది. అందులో జవాన్ మూవీ కూడా ఒకటి.. ఇక సామ్ కాదు అన్న తర్వాతే ఈ బిగ్ ఆఫర్ నయన్ ను వరించింది. ఏది ఏమైనా సామ్.. ఇలాంటి ఆఫర్ ను వదులుకోకుండా ఉండాల్సింది అని అభిమానులు కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు.