బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుండి రాబోతున్న మరో భారీ సినిమా ‘జవాన్’..ప్రపంచవ్యాప్తంగా వున్న షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.షారుఖ్ నటించిన ‘పఠాన్’ సినిమా భారీ హిట్ అందుకోవడంతో జవాన్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఎన్నో ఏళ్ల తర్వాత షారుఖ్ పఠాన్ సినిమాతో తన రేంజ్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో షారుఖ్ జవాన్ సినిమాలో నటిస్తున్నాడు.పఠాన్ సినిమాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు తాను చేస్తున్న జవాన్ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్స్ పెద్ద ఎత్తున ఉండడంతో హిందీతో పాటు తమిళ్ ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు వున్నాయి.
ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే దీపికా పదుకొనె కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది.. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. విజయ్ సేతుపతి, ప్రియమణి, సునీల్ గ్రోవర్ మరియు సన్యా మల్హోత్రా వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా టీజర్ కోసం షారుఖ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ విడుదల తేదీ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. జవాన్ టీజర్ ను జులై 7న విడుదల చేయబోతున్నారు అని సమాచారం.ముందుగా ఈ సినిమాను జూన్ లో విడుదల చేయాలనీ భావించారు కానీ కొన్ని కారణాల వల్ల విడుదలను సెప్టెంబర్ 7 కు వాయిదా వేశారు.ఈ సినిమా జూన్ నుండి సెప్టెంబర్ 7కు వాయిదా పడడంతో రెండు నెలల ముందు నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం.. మరి ఈ సినిమా షారుఖ్ కు పఠాన్ వంటి భారీ హిట్ ను అందిస్తుందో లేదో చూడాలి.