Dil Raju :జవాన్ సినిమా తెలుగు హక్కుల కోసం ప్రయత్నిస్తున్న దిల్ రాజు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ సినిమా ను చేస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి లో ఎంతో గ్రాండ్ గా విడుదలవబోతుంది.రీసెంట్ గా షారుఖ్ ఖాన్ నటించిన పాన్ ఇండియా సినిమా పఠాన్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఇండియా వైడ్ గా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా గా పఠాన్ నిలిచింది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో షారుఖ్ ఖాన్ నటించిన ‘ జవాన్ ‘ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.తెలుగులో స్టార్ హీరోలు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోలు కూడా వివిధ భాషలలో తమ సత్తాను చాటే ప్రయత్నం చేస్తున్నారు.ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగు నేటివిటీ టచ్ చేస్తూ ‘ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ‘ సినిమా ను చేశాడు. ఇది కథ పరంగా అంతగా వర్కౌట్ కాలేదు. అందుకే ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.
మరో వైపు షారుఖ్ ఖాన్ ఏకంగా తమిళ దర్శకునితోనే జవాన్ సినిమాను చేస్తున్నారు.ఈ సినిమాతో ఎలాగైనా సౌత్ మార్కెట్లో మంచి క్రేజ్ ను పొందాలని చూస్తున్నారు షారుఖ్.. తాజాగా ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీ స్థాయి లో బిజినెస్ జరిగిందని సమాచారం.తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా హక్కులని కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి.సాధారణంగా దిల్ రాజ్ ఒక సినిమాను ఎన్నో అంచనాలు వేసి కొనుగోలు చేస్తారు.షారుఖ్ గత సినిమా పఠాన్ మంచి విజయం సాధించడం తో దిల్ రాజు జవాన్ సినిమాను భారీ ధరకు డీల్ సెట్ చేసుకున్నట్లు తెలిస్తుంది. ఏదేమైనా జవాన్ సినిమా పై దిల్ రాజు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు వారు చెబుతున్నారు.ఇక ఈ సినిమా పై ఇండియా వైడ్ గా భారీ గా అంచనాలు వున్నాయి.
Also Read
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
- Tags
- Atlee
- Dil Raju
- patan
- Sharukh Khan
తాజావార్తలు
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!