Nayanthara : బాలీవుడ్ సెలబ్రిటీలు ఎల్లప్పుడూ రాయల్ లైఫ్ గడుపుతుంటారు. వారు వాడే వస్తువులన్నీ చాలా ఖరీదైనవి. ఆ వస్తువులతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. రంగుల ప్రపంచంలో కొందరు సెలబ్రిటీలు ఉన్నారు.. వారికి భారతదేశంలోనే కాదు, విదేశాలలో కూడా కోట్ల విలువైన ఆస్తులున్నాయి. బాలీవుడ్ నటీనటులే కాదు.. సౌత్ సినీ ఇండస్ట్రీల్లోని సెలబ్రిటీలు కూడా తమ ఖరీదైన జీవనశైలితో వార్తల్లో నిలుస్తున్నారు. కోట్లాది సంపదలు, విలాసవంతమైన బంగ్లాలు, ఖరీదైన కార్లు… మొదలైన వాటి కారణంగా రంగుల ప్రపంచంలో వెలుగుతూ ఉంటారు. ఇప్పుడు ప్రముఖ సౌత్ నటి ఆస్తుల గురించి చర్చనడుస్తోంది. ఆమె మరెవరో కాదు లేడి సూపర్ స్టార్ నయనతార.
నయన్ కు ఓ ప్రైవేట్ జెట్, విలాసవంతమైన బంగ్లా, ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆమె రాయల్ లైఫ్ లీడ్ చేస్తోంది. సినిమాల ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా నయనతార కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. నటి సంపద మొత్తం తెలిస్తే షాక్ కావాల్సిందే. నయనతార తన అందం, నటనతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు.
Read Also:Sajjala Ramakrishna Reddy : రాజశేఖరరెడ్డి వెళుతూ వెళుతూ తన కొడుకును మనకు అప్పగించి వెళ్ళారు
మీడియా కథనాల ప్రకారం.. హైదరాబాద్‌లో నయనతారకు రూ.15 కోట్ల విలువైన ఇల్లు ఉంది. నటికి చెన్నైలో 4 BHK ఇల్లు ఉంది. చెన్నైలోని నయన్ ఇంటి విలువ రూ.100 కోట్లు. కేరళ, ముంబైలలో కూడా నయనతారకు విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. ఆ ఇళ్ల విలువ కూడా కోట్ల రూపాయలే. కేవలం విలాసవంతమైన మాత్రమే కాదు. నటి తన సొంత ప్రైవేట్ జెట్‌లో దేశవ్యాప్తంగా తిరుగుతుంది. నటి ప్రైవేట్ జెట్ ఖరీదు కూడా రూ.కోట్లలోనే ఉంటది. నయనతార కార్ కలెక్షన్ కూడా అద్భుతంగా ఉంది. నటికి 88 లక్షల విలువైన BMW, మెర్సిడెస్ కారు ఉంది. ఇది కాకుండా నయనతార టయోటా ఇన్నోవా క్రిస్టా, ఫోర్డ్, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌లను కూడా కలిగి ఉంది. అలాగే చెన్నైలో మూతపడిన 53ఏళ్లనాటి థియేటర్ ను నయనతార కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.
నయన్ నికర విలువ దాదాపు 22 మిలియన్లు అంటే దాదాపు 165 కోట్లు. నయనతార ఒక సినిమాకు దాదాపు 10 కోట్లు తీసుకుంటుంది. నయతార తన సంపద, వ్యక్తిగత జీవితం గురించి కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. నయనతార పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి అభిమానుల హృదయాలను ఏలింది. సోషల్ మీడియా కూడా ఎప్పుడూ నటి గురించి చర్చలతో నిండి ఉంటుంది. ప్రస్తుతం తొలిసారిగా షారూఖ్ సరసన జవాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది.
Read Also:Nayanatara: మరో కేసులో ఇరుక్కున్న నయనతార.. ఆస్తి కాజేశారంటు కేసు..