Shahrukh Khan: అట్లీ కోసం ‘జవాన్’ గా షారుక్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ యువ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో షారుక్ ఖాన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే! దాని పేరును శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దీనికి ‘జవాన్’ అనే పేరు ఖరారు చేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పై షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఎస్.ఆర్.కె. ప్రెజంటర్ గా ఉన్నారు. ఈ మూవీ టైటిల్ కు ను ప్రకటిస్తూ ఓ టీజర్ ను విడుదల చేశారు. ఒళ్ళంతా గాయాలతో ఉన్న జవాన్.. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై శత్రువుల కోసం వేచి చూస్తుండే ఈ టీజర్ గూస్ బంబ్స్ కలిగిస్తోంది.
‘రాజారాణీ’ కోసం తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్న అట్లీ ఆ తర్వాత ‘తేరి, మెర్సిల్, బిగిల్’ వంటి యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. అతని ట్రాక్ రికార్డ్ చూసి ఇంప్రస్ అయిన షారుక్ ఈ పాన్ ఇండియా మూవీకి దర్శకత్వం వహించే ఛాన్స్ అట్లీకి కల్పించాడు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ‘జవాన్’ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే యేడాది జూన్ 2న విడుదల చేయబోతున్నారు. షారుక్ ఖాన్ సినిమాలను చూసి, ఆయన్ని అభిమానిస్తూ పెరిగిన తాను ఇవాళ అదే వ్యక్తిని డైరెక్ట్ చేయడం గౌరవంగా ఉందంటూ అట్లీ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు.
Also Read
- December Clash : డిసెంబర్ రేస్‌లో రెబల్ స్టార్ vs కింగ్ ఖాన్
- Hi Movie OTT: నయనతార 'హాయ్' మూవీ డిజిటల్ డీల్ ఫిక్స్.. థియేటర్ల తర్వాత ఈ ఓటీటీలో స్ట్రీమింగ్!
- Korean Kanakaraju: అనంతపురం నేలపై 'కొరియన్ కనకరాజు' సందడి.. చిరంజీవి స్టెప్పులే స్ఫూర్తి అన్న వరుణ్ తేజ్!
- Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
తాజావార్తలు
-
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
December Clash : డిసెంబర్ రేస్‌లో రెబల్ స్టార్ vs కింగ్ ఖాన్
-
FIFA World Cup 2026 Awards List: ఫిఫా వరల్డ్ కప్ అవార్డుల జాబితా.. అన్ని ప్రధాన వ్యక్తిగత అవార్డులు స్పెయిన్‌కే
-
Hi Movie OTT: నయనతార ‘హాయ్’ మూవీ డిజిటల్ డీల్ ఫిక్స్.. థియేటర్ల తర్వాత ఈ ఓటీటీలో స్ట్రీమింగ్!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!