Atlee: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు. తన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. రాజా రాణి సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు అట్లీ. మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన.. ఆ సినిమాలో నటించిన నటి ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. పెళ్ళైన 8 ఏళ్ళ తరువాత ప్రియ ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయాన్ని ఈ జంట చెప్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక తాజాగా ప్రియ.. మగబిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పుకొచ్చాడు. “వారు చెప్పింది నిజమే.. ప్రపంచంలో ఇంతటి ఆనందం మరొకటి ఉండదు. మాకు మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మా కుటుంబానికి మీ ఆశీర్వాదాలు కావాలి” అంటూ తెలిపాడు. దీంతో అభిమానులందరూ అట్లీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Shakuntalam: సమంత శాకుంతలం వాయిదా..?
ఇక ఇప్పటివరకు పరాజయమే లేని డైరెక్టర్ గా కొనసాగుతున్న అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి గట్టి ప్లాన్ వేస్తున్నాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 2 న రిలీజ్ కు సిద్ధం అవుతోంది. జవాన్ పై అటు బాలీవుడ్ మాత్రమే కాదు కోలీవుడ్ సైతం ఆశలు పెట్టుకొంది. మరి పరాజయాన్నే చవిచూడని ఈ డైరెక్టర్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.