ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ స్టార్ పేస్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది బౌలింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 11.50 ఎకానమీతో 23 రన్స్ ఇచ్చాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ దెబ్బకు షాహిన్ భారీగా రన్స్ ఇచ్చి.. వికెట్లేమీ తీయలేదు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం 16 బంతుల్లోనే 33 పరుగులు…
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా.. ఈ మ్యాచ్ తర్వాత పాక్ ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు కరచాలనం చేయలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిబంధనలు ఉల్లంఘించాడని, ఆయన్ను టోర్నీ నుంచి తొలగించాలని ఆసియా క్రికెట్ సంఘం (ఏసీసీ)కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీని తొలగించకుంటే.. టోర్నీని బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించింది. ఈ విషయంపై ఐసీసీని ఏసీసీ సాయం కోరింది. Also Read: Kribhco Chairman:…
యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025లో ‘కరచాలనం’ వివాదం నడుస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 14) మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్స్ కరచాలనం చేయడానికి తిరస్కరించడమే ఈ వివాదానికి కారణం. పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడం కోసమే ఇలా చేశామని భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫైర్ అయింది. ఇందుకు బాధ్యుణ్ని చేస్తూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ…
ఆసియా కప్ 2025లో భారత్ సూపర్-4కు చేరుకుంది. గ్రూప్-ఎ నుంచి సూపర్-4లో చోటు ఖాయమైంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమవారం భారత్‌కు మ్యాచ్ లేదు కానీ.. ఒమన్‌ను యూఏఈ ఓడించడంతో టోర్నీలో సూపర్-4 చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఎ నుంచి సూపర్-4కు అర్హత సాధించడానికి ఇంకా ఒక జట్టుకే అవకాశం ఉంది.…
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దాయాది పాకిస్థాన్‌తో ఆసియా కప్ 2025లో భారత్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ ఇండియన్ ఫాన్స్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అయితే ఐసీసీ, ఏసీసీ నిబంధనల ప్రకారం పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడక తప్పలేదు. మ్యాచ్ విజయంను పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం చేస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. మ్యాచ్ సాయంలో, పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పాక్ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయకుండా ఉండడంపై ఫాన్స్ హర్షం…
ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని ఇండియన్ ఫాన్స్ డిమాండ్ చేశారు. ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. ఈ నేపథ్యంలో టాస్ సమయంలో, మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్…
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దాయాది పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడొద్దని భారత అభిమానులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆసియా కప్ 2025లో భాగంగా నవంబర్ 14న దుబాయ్ వేదికగా మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్ ఆసియా కప్ 2025’, ‘బాయ్‌కాట్ భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్’ అని ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఐసీసీ, ఏసీసీ నిబంధనలకు లోబడి మ్యాచ్ ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసింది. బాయ్‌కాట్ ట్రెండ్ నేపథ్యంలో ఇండో-పాక్ మ్యాచ్‌కు…
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే.. హోరాహోరీ పోరు, ఆటగాళ్లలో కసి, అభిమానుల్లో ఎంతో ఆసక్తి, పతాక స్థాయిలో భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో ఇవేమీ కనిపించలేదు. దుబాయ్ స్టేడియంలో పాక్ అభిమానుల సందడి కాసేపు కనిపించినా.. ఆ తర్వాత అది కూడా కనిపించకుండా పోయింది. పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కారణంగా ఫాన్స్ నిరాశలో కనిపించారు. భారత్ చేతిలో ఓటమి అనంతరం…
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముంగిట ఓ బిగ్ మిస్టేక్ చోటుచేసుకుంది. క్రికెట్ ఆటలో మ్యాచ్ ఆరంభానికి ముందు రెండు జట్ల ఆటగాళ్లు.. తమ తమ జాతీయ గీతాలు ఆలపించడం ఆనవాయితీ. ఇండో-పాక్ మ్యాచ్‌లో ముందుగా పాకిస్థాన్ జాతీయ గీతం మొదలు కావాల్సి ఉంది. అయితే డీజే ఆపరేటర్ పొరపాటుగా పంజాబీ-ఇంగ్లిష్ పాప్ సాంగ్ ‘జలేబీ బేబీ’ని ప్లే చేశాడు. దాంతో పాక్…
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్ ఘోర ఓటమిని ఎదుర్కొంది. ముందుగా బ్యాటింగ్‌లో 127 పరుగులే చేసిన పాక్.. ఆపై బౌలింగ్‌లో కూడా దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఘోర వైఫల్యం ఆ జట్టుపై ప్రభావం చూపింది. ప్రపంచంలో బెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన అఫ్రిది.. 16 ఓవర్లలో రెండు ఓవర్లే బౌలింగ్ చేయడం విశేషం. ఆ రెండు ఓవర్లలో ఏకంగా…